Job Loss | ఉన్నట్టుండి జాబ్ పోయిందా? ఇలా చేస్తే ఇక నో టెన్షన్స్ !!
Job Loss | హైర్ అండ్ ఫైర్.. నేటి హెచ్ఆర్ పాలసీ! నియమించుకో, పనిచేయించుకో, వదిలించుకో.. నాలుగో ముచ్చటే లేదు. కుమిలిపోతూ కూర్చుంటే లాభం లేదు. ఎవర్నో తిట్టుకోవడం వల్లా ఉపయోగం లేదు. జాబ్ మార్కెట్‌కు తగినట్టు మన మైండ్‌సెట్ మార్చుకోవాలి.
Job Loss | హైర్ అండ్ ఫైర్.. నేటి హెచ్ఆర్ పాలసీ! నియమించుకో, పనిచేయించుకో, వదిలించుకో.. నాలుగో ముచ్చటే లేదు. కుమిలిపోతూ కూర్చుంటే లాభం లేదు. ఎవర్నో తిట్టుకోవడం వల్లా ఉపయోగం లేదు. జాబ్ మార్కెట్‌కు తగినట్టు మన మైండ్‌సెట్ మార్చుకోవాలి. ఎంత గొప్ప కంపెనీ అయినా సరే, ఎంత ఒత్తిడిలేని కొలువైనా సరే.. ఏదో ఒకరోజు బయటికి వెళ్లకతప్పదనే ఎరుకతో వ్యవహరించాలి. ప్రతి జీతం చివరి జీతమనే భావించాలి. లేకపోతే, ఒక్కసారిగా ఒడ్డునపడిన చేపల్లా విలవిల్లాడిపోతాం.

కొలువును కాకెత్తుకెళ్లగానే.. మీరు దృష్టి పెట్టాల్సిన విషయం.. బడ్జెట్. ఇంకొంతకాలం మీ బ్యాంకు ఖాతాలో జీతం డబ్బులు పడవు. పొదుపు చేసుకున్న సొమ్ముతోనే నెట్టుకు రావాలి. ఇప్పటికే, ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటుచేసుకుని ఉంటే మరీ మంచిది. ఖర్చులలో మూడు రకాలు.. అత్యవసరం, అవసరం, అనవసరం. కొంతకాలం అత్యవసర వ్యయాలకు మాత్రమే పరిమితం కావాలి. విందులు, వినోదాలు, టూర్లు, ఖరీదైన షాపింగ్‌లు వద్దేవద్దు.

ఫొటోగ్రఫీ, పెయింటింగ్, కోడింగ్.. మీ అభిరుచిని ఉపాధి మార్గంగా మార్చుకునే అవకాశం ఉందేమో ఆలోచించండి. నచ్చిన పనిలోనే సంతోషం, సంపాదన!

డబుల్ ధమాకా ఆఫర్ అంటే.. ఇదే. మీకు ఉద్యోగం లేదన్న విషయం దాచిపెట్టే ప్రయత్నం వద్దు. అందరికీ చేరనివ్వండి. మీ నైపుణ్యం, అనుభవం,నాయకత్వ లక్షణం గురించి.. జాబ్ మార్కెట్లో తెలియడానికి ఇదో మార్గం. మీ రెజ్యూమే అప్డేట్ చేసుకోండి. పాత కొలీగ్స్‌ను పలకరించండి. ఇతర సంస్థల అవసరాలను వాకబు చేయండి.
మెల్లమెల్లగా ఉద్యోగాల స్వరూపాలు, స్వభావాలు మారుతున్నాయి. దానికి తగినట్టు మీరూ మారాలి. అవసరమైతే రాత్రి కొలువులకు సిద్ధపడాలి. కొత్త నైపుణ్యాలు పెంచుకోవాలి. ‘ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ’, ‘టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనే అహాన్ని వదిలిపెట్టుకోవాలి. కొత్తతరంతో కలిసిపోవాలి.

ఎన్నాళ్లని.. ఉద్యోగ ప్రకటనలు వెతుకుతారు. స్టార్టప్ కల్చర్ విస్తరిస్తున్నది. ఇన్వెస్టర్లు కొత్త ఐడియాలను స్వాగతిస్తున్నారు. మీ అనుభవాన్ని రంగరించి ఓ కంపెనీకి ప్రాణంపోయండి. వీలైతే మిత్రులనూ భాగస్వాములను చేసుకోండి. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతుంది. ఇకనుంచి మీకు మీరే బాస్. మీ ఎదుగుదల మీ చేతుల్లోనే ఉంటుంది.

ఐదుపదుల వయసులో కొత్త ఉద్యోగం కొంత కష్టమే. కానీ, కొత్త అవకాశాలు మాత్రం చాలానే ఉంటాయి. కన్సల్టెంట్ అవతారం ఎత్తండి. మీ నైపుణ్యమే మీ పెట్టుబడి. తొలిదశలో స్థిరమైన ఆదాయం ఉండకపోవచ్చు. కానీ, ఒత్తిడి తక్కువ. మోయగలిగినంత భారాన్నే భుజాన వేసుకుంటారు. మీ పని నచ్చితే, జాబ్ ఆఫర్లూ రావచ్చు.

కార్పొరేట్ వైద్యం అనివార్యమైన రోజులివి. ఒక్కసారి దవాఖాన పాలైతే లక్షలకు లక్షలు వదిలించుకోవాలి. ఆ విపత్కర సమయంలో ఆరోగ్య బీమా మీ కుటుంబానికి రక్షణ కవచంగా నిలుస్తుంది. చాలామంది ఉద్యోగులు యాజమాన్యాలు ఇచ్చే ఆరోగ్య బీమాపైనే ఆధారపడతారు. కానీ, కొలువుతోపాటూ బీమా సౌకర్యమూ ఆగిపోతుంది. తక్షణం ఓ విశ్వసనీయ సంస్థ నుంచి ఆరోగ్య బీమా తీసుకోండి. ఖర్చులు తగ్గించుకునే నెపంతో వివిధ పాలసీల ప్రీమియంలు ఆపేయకండి.

ఇలాంటి సమయాల్లో.. చాలామంది ఒత్తిడికి గురవుతారు. డిప్రెషన్లోకి వెళ్లి పోతారు. తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. జీతమే జీవితం అనుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఉద్యోగం అనేది ఓ శాశ్వత సమస్యకు తాత్కాలిక పరిష్కారం. ధైర్యంగా ఉండండి. ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోండి.
Read More :
ఆఫ్రికాలో సెటిలై వివిధ రంగాల వారికి ఇన్స్పిరేషన్గా మారిన మన తెలంగాణ బిడ్డలు వీళ్లే
“ఆఫ్రికా దేశంలోని ఓ బ్యాంకు రూపురేఖల్నే మార్చేసిన తెలంగాణ బిడ్డ.. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..”
ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్‌లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”
అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Entrepreneur
- job loss
- Start up
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

