Nita Ambani | కొడుకు పెళ్లిలో నీతా అంబానీ స్పెషల్ మెహందీ డిజైన్.. ఎలా ఉందో చూశారా..?
Nita Ambani | నీతా అంబానీ తన మెహందీ డిజైన్లో రాధా-కృష్ణుల ఫోటోతోపాటు అంబానీ కుటుంబ సభ్యులందరి పేర్లను రాయించుకున్నారు. ఇలా మెహందీలో ప్రియమైన వ్యక్తుల పేర్లను రాసే సంప్రదాయం భారతదేశంలో శతాబ్దాల నాటి నుంచి ఉంది.
Nita Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జూలై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. అనంత్ అంబానీ మెహందీ వేడుకలో నీతా అంబానీ మెహందీ డిజైన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నీతా అంబానీ తన మెహందీ డిజైన్లో రాధా-కృష్ణుల ఫోటోతోపాటు అంబానీ కుటుంబ సభ్యులందరి పేర్లను రాయించుకున్నారు. ఇలా మెహందీలో ప్రియమైన వ్యక్తుల పేర్లను రాసే సంప్రదాయం భారతదేశంలో శతాబ్దాల నాటి నుంచి ఉంది. మెహందీ అనేది మన దేశంలో ఆనందం, అందం, శుభ ప్రారంభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు నీతా అంబానీ కూడా తన కుమారుడి పెళ్ళిలో అదే సంప్రదాయాన్ని రిపీట్ చేశారు. అందుకోసమే తన మెహందీ డిజైన్లో కుటుంబ సభ్యులందరి పేర్లను రాయించుకున్నారు.
ఇది కుటుంబం ఐక్యత, సామూహిక శక్తిని చూపుతుంది. అదే సమయంలో ఆమె చేతిపై ఉన్న రాధా-కృష్ణుల బొమ్మ దైవిక ప్రేమను ప్రతిభింబించింది. నీతా అంబానీ తన మెహందీ డిజైన్లో అనంత్-రాధిక, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా, కుమార్తె ఇషా అంబానీ , అల్లుడు ఆనంద్ పిరమల్, భర్త ముకేశ్ అంబానీ, మనవళ్లు పృథ్వీ, వేద్, కృష్ణ, ఆదియా పేర్లను రాయించుకున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

