Diwali Offers on Home Loans | ఎస్బీఐ టూ ఐసీఐసీఐ.. వడ్డీరేట్ల తగ్గింపు.. చార్జీలు మాఫీ!
Diwali Offers on Home Loans | దీపావళి సందర్భంగా పలు బ్యాంకులు ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లపై రాయితీ ఇచ్చాయి. ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేశాయి.
బ్యాంక్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ కూడా రుణాలపై ఇండ్ల కొనుగోలుదారులకు ఆఫర్లు అందిస్తున్నాయి. సంబంధిత రుణ గ్రహీతల సిబిల్ స్కోర్ కూడా రాయితీలకు కీలకంగా మారనున్నది. ఇండ్ల రుణాలతోపాటు కార్ల రుణాలపై పలు బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేశాయి.
సిబిల్ స్కోర్ ————– రుణంపై ఇంతకుముందు వడ్డీ — ఫెస్టివ్ రాయితీ —- ప్రస్తుత వడ్డీ
800 కంటే ఎక్కువ ——- 8.55% —————————– 15 బీపీఎస్ ————- 8.40%
750 – 799 —————– 8.65% —————————— 25 బీపీఎస్ ———— 8.40%
700 -749 —————– 8.75% ——————————- 20 బీపీఎస్ ———– 8.55%
ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇలా
దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా 8.45 శాతానికే ఇండ్లు, కార్ల రుణాలు ఆఫర్ చేస్తున్నది. కార్ల రుణాలపై ఫోర్ క్లోజర్ చార్జీలు రద్దు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా తన కస్టమర్లకు దీపావళి ఆఫర్లు తెచ్చింది. ఇండ్లు, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు రద్దు చేసింది. 8.25 శాతం వడ్డీరేటు నుంచి ఇండ్ల రుణాలిస్తున్నది. ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సైతం ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లను 30-70 బేసిక్ పాయింట్లు తగ్గిస్తున్నది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇండ్ల రుణాలపై బేస్ వడ్డీరేటు 8% నుంచి మొదలవుతాయి.
సిబిల్ స్కోర్‌ను బట్టి హెచ్డీఎఫ్సీ బ్యాంకు వడ్డీరేటు
ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఇండ్ల కొనుగోలుదారుల సిబిల్ స్కోర్ 750, అంతకంటే ఎక్కువగా ఉంటే 8.4 % వడ్డీపై ఇండ్ల రుణాలు మంజూరు చేస్తున్నది. ఈ ఆఫర్ వచ్చేనెల 30 వరకు అమల్లో ఉంటుంది. ఇండ్ల కొనుగోలు దారులు తీసుకునే రుణం మొత్తం, వారి సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీరేట్లలో రాయితీలు వర్తింప చేస్తున్నది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు 8.60 నుంచి 9% వరకు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు రుణం 10.50 శాతం వడ్డీతో ఇస్తున్నది. బిజినెస్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు సగం డిస్కౌంట్ అందిస్తున్నది.
బజాజ్ ఫైనాన్స్‌లో 8.2% వడ్డీకే ఇండ్ల రుణాలు
దీపావళి ఆఫర్లో భాగంగా బజాజ్ ఫైనాన్స్ కూడా ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లలో రాయితీ కల్పిస్తున్నది. వేతన జీవులు, ప్రొఫెషనల్స్‌కు 8.2% శాతం వరకు వడ్డీ రేటు కుదిస్తున్నది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆఫర్ వచ్చేనెల 30 వరకు వర్తిస్తుంది. మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ సైతం కస్టమర్లకు ఫెస్టివ్ బోనంజా తీసుకొచ్చింది. ప్రీ-అప్రూవ్డ్ హోంలోన్, ప్రీ-అప్రూవ్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రూ.999 గా ఖరారు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

