Disney+ Hotstar | హాట్‌స్టార్ కీలక నిర్ణయం.. ‘జియో సినిమా’ దెబ్బ ఇలా ఉంటది మరి.. ?!
Disney+ Hotstar | జియో సినిమా దెబ్బకు డిస్నీ + హాట్ స్టార్ దిగొచ్చింది. క్రికెట్ టోర్నీలపై భారత్ లో ఉచితంగా ప్రసారం చేస్తామని ప్రకటించింది.
Disney+ Hotstar | జియో సినిమా బాటలో వాల్ట్‌డిస్నీ కో హాట్‌స్టార్ ప్రయాణిస్తున్నది. ఇక నుంచి భారత్ లో జరిగే అన్ని క్రికెట్ టోర్నమెంట్లపై మొబైల్ ఫోన్లలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం (Streaming) చేయనున్నది. క్రికెట్ పట్ల క్రేజ్ ఉన్న భారతీయుల మనస్సు చూరగొనేందుకు ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2023 సీజన్లో రిలయన్స్ జియో ఆధీనంలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్.. జియో సినిమా లక్షల మంది వీక్షకులను సొంతం చేసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆకర్షణీయ స్పోర్ట్స్ ఈవెంట్‌గా ఐపీఎల్ నిలిచింది.
హాట్‌స్టార్ నుంచి ఐపీఎల్ ఇంటర్నెట్ ప్రసార హక్కులను జియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ టోర్నీ జరిగిన ఐదు వారాల్లో రికార్డు స్థాయిలో జియో సినిమా 1300 కోట్ల డిజిటల్ వీక్షకులను సొంతం చేసుకున్నది. ప్రతి వీక్షకుడు ప్రతి మ్యాచ్ సగటున గంట సేపు వీక్షించాడని తెలుస్తున్నది. ఐపీఎల్ ప్రసార హక్కులు కోల్పోయిన హాట్ స్టార్..2023 సీజన్లో 50 లక్షల మంది వీక్షకులను కోల్పోయిందని రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్, ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్లపై ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని హాట్ స్టార్ శుక్రవారం వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కంటెంట్ వీక్షకుల నుంచి చార్జీలు వసూలు చేసేందుకు ఇదిలా ఉంటే జియో సినిమా సిద్ధమైంది. అయినా, ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ ఉచితంగానే అందిస్తామని జియో సినిమా ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

