Reliance | నిరాశపరిచిన రిలయన్స్.. క్యూ4లో రూ.18,951 కోట్ల లాభం
గత త్రైమాసికంలో అన్ని విభాగాలు పటిష్టమైన ఆర్థిక, నిర్వహణ పనితీరును నమోదు చేశాయి. పన్నులు చెల్లించకముందు లక్ష కోట్ల లాభాన్ని ఆర్జించిన తొలి సంస్థ రిలయన్స్ కావడం విశేషం. డిజిటల్ రంగం బూస్ట్‌నిచ్చింది.
గత త్రైమాసికంలో అన్ని విభాగాలు పటిష్టమైన ఆర్థిక, నిర్వహణ పనితీరును నమోదు చేశాయి. పన్నులు చెల్లించకముందు లక్ష కోట్ల లాభాన్ని ఆర్జించిన తొలి సంస్థ రిలయన్స్ కావడం విశేషం. డిజిటల్ రంగం బూస్ట్‌నిచ్చింది.
– ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ
Reliance | న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.18,951 కోట్ల నికర లాభం లేదా ప్రతిషేరుకు రూ.28.01 ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.19,299 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.28.52 కంటే తక్కువగా నమోదైంది. కానీ, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.17,265 కోట్ల కంటే అధికం కావడం విశేషం. చమురు అధిక ధరల కారణంగా గత త్రైమాసికంలో సంస్థ రూ.2.64 లక్షల కోట్ల ఆదాయాన్ని గడించింది. గతేడాది కంటే ఇది 11 శాతం అధికం. చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారాలు ఆశాజనక పనితీరు కనబరిచినప్పటికీ టెలికం, రిటైల్ రంగాలు సంస్థ లాభాలకు గండికొట్టాయి.
- రిటైల్ బిజినెస్ నుంచి సంస్థ రూ.2,698 కోట్ల లాభాన్ని గడించింది.
- 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 డివిడెండ్‌ను ప్రకటించింది. ఇప్పటికే రూ.9 డివిడెండ్‌ను ఇచ్చింది.
- కేజీ బేసిన్ నుంచి రోజుకు 30 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్, 23 వేల బ్యారెల్ల చమురును ఉత్పత్తి చేస్తున్నది.
- కంపెనీ రుణాలు రూ.3.11 లక్షల కోట్ల నుంచి రూ.3.24 లక్షల కోట్లకు పెరిగాయి. అలాగే నగదు నిల్వలు రూ.12.5 లక్షల కోట్ల నుంచి రూ.1.16 లక్షల కోట్లకు తగ్గాయి.
10 లక్షల కోట్ల ఆదాయం
రిలయన్స్ మరో చరిత్రను సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.10 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఒక ఏడాదిలో ఇంతటి స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించిన దేశీయ తొలి సంస్థ రిలయన్స్ కావడం విశేషం. అలాగే గతేడాదికిగాను రూ. 69,621 కోట్ల నికర లాభాన్ని గడించింది.
జియో లాభం 5,337 కోట్లు
జియో లాభాల్లో దూసుకుపోతున్నది. గడిచిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.5,337 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,716 కోట్ల లాభంతో పోలిస్తే 13 శాతం ఎగబాకింది. అలాగే సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 11 శాతం ఎగబాకి రూ. 25,959 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1,00,119 కోట్ల ఆదాయంపై రూ.21,424 కోట్ల లాభాన్ని గడించింది. మరోవైపు, జియో మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ మశ్రువాలా తన పదవికి రాజీనామా చేశారు. ధీరుభాయి అంబానీ కాలం నుంచి రిలయన్స్‌లో కీలక వ్యక్తిగా వ్యవహరించిన మశ్రువాలా..జూన్ 9న వైదొలగనున్నారు. దీంతో పంకజ్ మోహన్ పవార్ ఎండీగా కొనసాగనున్నారు. జియో కస్టమర్లు 47 కోట్ల నుంచి 48 కోట్లకు పెరిగారు. ఒక్కో కస్టమర్‌పై సరాసరిగా రూ.181.7 ఆదాయాన్ని ఆర్జిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

