అడ్వాన్స్ టాక్స్ ఎఫెక్ట్.. 30% పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!
Direct Tax | గతేడాదితో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8.36 లక్షల కోట్లు (30%) పెరిగాయి.
Direct Tax | గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 30 శాతం పెరిగాయి. ఏప్రిల్ నుంచి ఈ నెల 17 వరకు అడ్వాన్స్ పన్ను వసూళ్లు పెరగడంతో ప్రత్యక్ష పన్ను రూపేణా రూ.8.36 లక్షల కోట్లకు పైగా వసూలయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు 17 శాతం పెరిగాయి.
`ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8,36,225 కోట్లకు చేరాయి. గతేడాది (2021-22)లో రూ.6,42,287 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 30 శాతం పెరిగాయి` అని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఏప్రిల్ నుంచి ఈ నెల 17 వరకు అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు రూ. 2,95,308 కోట్లకు చేరాయని తెలిపింది.
రూ.8,36,225 కోట్ల స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ ఇన్‌కం టాక్స్ రూ.4.36 లక్షల కోట్లు, వ్యక్తిగత ఇన్‌కం టాక్స్ రూ.4.36 లక్షల కోట్లు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ రూ.3.98 లక్షల కోట్లుగా ఉంది. రీఫండ్స్ సర్దుబాటు తర్వాత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7,00,669 కోట్లు (23 శాతం వృద్ధి) నమోదయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రూ.5,68,147 కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు మాత్రమే జరిగాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

