న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: కొటక్ మహీంద్రా బ్యాంక్ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో దీపక్ గుప్తాను నియమిస్తూ రిజర్వుబ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. ఉదయ్ కొటక్ రాజీనామా చేయడంతో ఈ స్థానంలో గుప్తాను నియమించింది సెంట్రల్ బ్యాంక్.
ఈ నెల 2 నుంచి అమలులోకి వచ్చేలా ఈ నియామకం వచ్చే రెండు నెలలు మాత్రమే అమలులో ఉండనున్నది. అప్పటి వరకు నూతన ఎండీ, సీఈవోను నియమించుకోవాలని బ్యాంక్‌ను ఆర్బీఐ ఆదేశించింది.