పాలసీ హోల్డర్లకు ఐపీవో ఆఫర్లు
ఎల్ఐసీ మెగా ఐపీవోలో పెట్టుబడి చేసేందుకు సంస్థ తన పాలసీ హోల్డర్లకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నది. ఐపీవోలో జారీచేసే షేర్లలో 10 శాతం షేర్లను పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేసినట్టు ఎల్ఐసీ సెబీకి సమర్పించిన ఆఫర్ డాక్యుమెంట్లో తెలిపింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఎల్ఐసీ మెగా ఐపీవోలో పెట్టుబడి చేసేందుకు సంస్థ తన పాలసీ హోల్డర్లకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నది. ఐపీవోలో జారీచేసే షేర్లలో 10 శాతం షేర్లను పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేసినట్టు ఎల్ఐసీ సెబీకి సమర్పించిన ఆఫర్ డాక్యుమెంట్లో తెలిపింది. ఎల్ఐసీ ఐపీవో ద్వారా ప్రభుత్వం దాదాపు 31 కోట్ల షేర్లను విక్రయించవచ్చని భావిస్తున్నారు. ఇందులో 10 శాతం..3 కోట్ల షేర్లు పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేయవచ్చు. ఆఫర్ పరిమాణాన్ని ఇప్పటివరకూ సంస్థ వెల్లడించలేదు. ఇష్యూ ధరలో కొంత డిస్కౌంట్‌ను కూడా పాలసీ హోల్డర్లకు ఎల్ఐసీ ఇవ్వనుంది. ఇష్యూ ధర కూడా ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఈ రిజర్వేషన్ క్యాటగిరిలో దరఖాస్తు చేసిన అర్హమైన పాలసీ హోల్డరుకు..డిస్కౌంట్ తర్వాత రూ. 2 లక్షల విలువకు మించని షేర్లను కేటాయించనున్నట్టు ఆఫర్ డాక్యుమెంట్లో ఎల్ఐసీ తెలిపింది.
అర్హమైన పాలసీలు..
ఎల్ఐసీ ఐపీవోలో పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేసిన విభాగంలో దరఖాస్తు చేయడానికి..మెచ్యురిటీ, సరెండర్, పాలసీదారు మరణం వంటి కారణాలతో ఎల్ఐసీ రికార్డుల నుంచి తొలగింపబడని పాలసీలు అర్హమైనవి. సెబీకి ఐపీవో డాక్యుమెంట్‌ను సమర్పించిన తేదీకి (2022 ఫిబ్రవరి 13) ముందుగా పాలసీ తీసుకునే ప్రతిపాదనల్ని సమర్పించి, పాలసీ బాండ్‌ను ఆ తేదీ తర్వాత పొందినాకూడా ఆ పాలసీ హోల్డరు ఐపీవోలో పాలుపంచుకోవచ్చని సంస్థ తెలిపింది. పాలసీ హోల్డర్ మరణించిన తర్వాత ప్రస్తుతం యాన్యుటీ పొందుతున్న జీవిత భాగస్వామి..ఐపీవోకు దరఖాస్తు చేసేందుకు వీలు లేదు.
జాయింట్ లైఫ్ పాలసీ
ఇద్దరి పేరిట జాయింట్ లైఫ్ పాలసీ ఉంటే..వారిలో ఒకరు మాత్రమే ఐపీవో రిజర్వేషన్ క్యాటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు. పాలసీ తన పేరిట కలిగిన మైనరు కూడా ఆఫర్లో పెట్టుబడి చేయవచ్చు.
ఎన్నారైలు..
ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూలో పెట్టుబడి చేయడానికి అర్హులే. కానీ పాలసీ కలిగిన ఎన్నారైలకు రిజర్వేషన్ విభాగంలో దరఖాస్తు చేసే అనుమతి లేదు. వీరు రిటైల్ క్యాటగిరీలో దరఖాస్తు చేసుకోవాలి.
డీమ్యాట్ ఖాతా తప్పనిసరి
ఐపీవోలో కేటాయించే షేర్లను డీమెటీరియలైజ్డ్ రూపంలోనే ఎల్ఐసీ కేటాయిస్తుంది. అంటే ఐపీవోకు దరఖాస్తు చేయాలంటే పాలసీ హోల్డర్లయినా, రిటైల్ ఇన్వెస్టైర్లెనా డీమ్యాట్ ఖాతాను తప్పక కలిగి ఉం డాలి. పాలసీ హోల్డరు తన జీవిత భాగస్వామి, సం తానం లేదా బంధువుల డీమ్యాట్ ఖాతా నుంచి దరఖాస్తు చేయరాదు. అలాగే డీమ్యాట్ ఖాతా ప్రారంభించాలన్నా, ఐపీవోకు దరఖాస్తు చేయాలన్నా తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖ పాన్ కూడా కలిగి ఉండాలి.
28కల్లా పాన్ అప్డేట్
ఎల్ఐసీ మెగా ఐపీవోకు దరఖాస్తు చేయదల్చిన ఆ సంస్థ పాలసీ హోల్డర్లు ఈ నెల 28కల్లా పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) వివరాల్ని వారి పాలసీ రికార్డులో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్‌లో ఈ విషయాన్ని తెలిపింది. ఈ ఆఫర్లో పాలసీ హోల్డర్లకు 10 శాతం షేర్లను ఎల్ఐసీ రిజర్వ్ చేసింది. అలాగే ఇష్యూ ధరలో డిస్కౌంట్‌ను కూడా ఇస్తున్నది. సెబీకి ఆఫర్ డాక్యుమెంట్ సమర్పించిన తేదీ (ఫిబ్రవరి 13) నుంచి రెండు వారాల్లోగా (ఫిబ్రవరి 28) పాలసీ హోల్డర్లు వారి పాన్ వివరాల్ని సంస్థ రికార్డుల్లో అప్డేట్ చేయాలని, లేకపోతే పాలసీ హోల్డర్‌కు రిజర్వ్‌చేసిన విభాగంలో షేర్లకు దరఖాస్తు చేసే అర్హత ఉండదని ఈ సందర్భంగా ఎల్ఐసీ వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- LIC IPO
- policyholders
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

