Cyber Fraud | ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసగాళ్ల ఫ్రాడ్ ఇలా.. ఏం చేస్తున్నారంటే..?!
Cyber Fraud | ఫ్రీ సినిమా పేరిట ఓ లింక్ పంపుతారు. ఆ లింక్ కింద వచ్చిన యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారో మీ వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కుతాయి. అటుపై మీ ఖాతాలోని మనీ స్వాహా చేస్తున్నారు.
Cyber Fraud | సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తున్నారు. అమాయకులను బుట్టలో వేసుకోవడానికి రకరకాల ఎత్తుల జిత్తులకు పాల్పడుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ కొత్త సినిమా అంటే రిలీజ్ కాగానే చూసేద్దాం అన్న ఆసక్తి కలిగి ఉంటారు. ఇప్పుడు అంతా ఆన్ లైన్ కావడంతోపాటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రావడంతో సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లు, సీరియళ్లు కూడా వెంటనే చూడాలని భావిస్తారు. అలా వాటిని చూడటానికి టెలిగ్రామ్ గుర్తుకు వస్తుంది. ఓటీటీలో రిలీజ్ కాగానే.. సంబంధిత ప్లాట్ ఫామ్‌లో సబ్ స్క్రిప్షన్ లేకున్నా.. టెలి గ్రామ్‌లో ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇబ్బడి ముబ్బడిగా చేరిపోతున్నారు. యూజర్ల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు నూతన మోసాలకు దిగుతున్నారు.
సినిమా పేరు సెర్చ్ చేయగానే టెలిగ్రామ్‌లో ఫ్రీ డౌన్ లోడింగ్ అనే లింక్ లు కనిపించగానే.. పలువురు యూజర్లు దాన్ని క్లిక్ చేస్తారు. ఫ్రీగా సినిమా చూడాలంటే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్న సూచన వస్తుంది. అలా వచ్చిన సూచన పూర్వాపరాలు చెక్ చేసుకోకుండా సదరు యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారో ఇంతే సంగతులు. మీ పర్సనల్ డేటా.. అందులో మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతా డిటైల్స్ సైబర్ మోసగాళ్ల చేజిక్కుతాయి. అటుపై వారు చేతివాటం ప్రదర్శించి.. మీ ఖాతాల్లోని సొమ్ము ఖాళీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న సైబర్ దోస్త్ తెలిపింది. ఈ తరహా మోసాల పట్ల అలర్ట్‌గా ఉండాలంటూ.. టెలిగ్రామ్ లింక్‌ల ద్వారా వచ్చే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

