Videocon loan fraud case | వీడియోకాన్ రుణ వ్యవహారంలో అరెస్టైన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ల కస్టడీని సీబీఐ కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది.
చందా కొచ్చర్ సీఈవోగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ కంపెనీ రూ.3,200 కోట్లకుపైగా లోన్ తీసుకుంది. ఈ లోన్ మంజూరు సమయంలో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వీరిద్దరినీ ఈనెల 23న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రత్యేక కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది. అదనపు గడువు కోరుతూ సీబీఐ అప్పీల్ చేసింది. దీంతో కొచ్చర్ దంపతులకు 28 వరకు రిమాండ్ పొడిగించింది. తాజాగా మరో రెండు రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.