Tata Punch facelift | టాటా మోటార్స్ తన పాపులర్ సబ్-4 మీటర్ ఎస్యూవీ కారు పంచ్ ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. గత కొన్ని నెలలుగా న్యూ హారియర్, సఫారీ, నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కార్లను ఆవిష్కరించింది. టాటా పంచ్.ఈవీ ఆధారంగా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ చేశారు. తొలిసారి టాటా పంచ్ కారును 2021లో మార్కెట్లో ఆవిష్కరించారు. ఫుల్ విడ్త్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్ ఉంటుంది. రీ డిజైన్డ్ లోయర్ బంపర్, లార్జ్ ఎయిర్ ఇన్ టేక్స్ తోపాటు రేడియేటర్ గ్రిల్లె ఉంటాయి.
ఫ్రంట్‌లో కొత్తగా డిజైన్ చేసిన 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్లీకర్ బంపర్ తోపాటు రీ డిజైన్డ్ టెయిల్ గేట్, ఎల్ఈడీతోపాటు రివైజ్డ్ టెయిల్ లైట్స్, బంపర్లపై రిఫ్లెక్టర్లు, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్స్, షార్క్ ఫిన్ అంటీనా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంటాయి. క్యాబిన్ లోపల ట్విన్ 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఎయిర్ ఫ్యూరిఫయర్, కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వైర్ లెస్ పోన్ చార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో తదితర ఫీచర్లు ఉంటాయి.
టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ కారులోనూ 1.2 లీటర్లు-3 సిలిండర్స్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (86 హెచ్‌పీ విద్యుత్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా ఏఎంటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ అండ్ టర్బో పెట్రోల్ ఆప్షన్ తో కూడా ఆవిష్కరిస్తారని సమాచారం. ఈ కారు హ్యుండాయ్ ఎక్స్ టర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మారుతి ఇగ్నీస్, రెనాల్ట్ కైగర్, నిసాన్ మ్యాగ్నైట్ తదితర మోడల్ కార్లతో పోటీ పడుతుంది.