ముంబై, సెప్టెంబర్ 26:లాజిస్టిక్ స్టార్టప్ కోగోస్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి(సీవోవో), కంపెనీ బోర్డు డైరెక్టర్గా ప్రసాద్ కట్టా నియమితులయ్యారు. బిజినెస్ డెవలప్మెంట్, ఆపరేషన్, లీగల్, ఎంఐఎస్, బిజినెస్ ప్రాసెస్ వంటి కీలక విభాగాలకు ఆయన నాయకత్వం వహించనున్నారు.
లాజిస్టిక్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నప్పటికీ ఈ రంగంపై మరింత దృష్టి సారించినట్టు కోగోస్ సీఈవో, కో-ఫౌండర్ ప్రసాద్ శ్రీరామ్ తెలిపారు.