రామచంద్రాపురం, జూలై 24 : వినియోగదారుల కోసం సీఎంఆర్ షాపింగ్ మాల్ క్రేజీ కేజీ సేల్స్, కాంబో ఆఫర్స్‌ని తీసుకొచ్చింది. ఆడి-శ్రావణం ప్రత్యేకంగా అతిపెద్ద డిస్కౌంట్ సేల్స్‌ను ప్రారంభించడం జరిగిందని షాపింగ్ మాల్ ఎండీ వెంకటరమణ, క్లస్టర్ మేనేజర్ దయానంద్ తెలిపారు. సీఎంఆర్‌లో అన్ని వర్గాలవారు మెచ్చే వస్ర్తాలు అందుబాటులో ఉంటాయన్నారు. పిల్లలు, పెద్దలకు కావాల్సిన బట్టలు సరసమైన ధరలకే లభిస్తాయని వివరించారు. పండుగలు, వివాహాది శుభకార్యాలన్నింటికీ కుటుంబ సమేతంగా విచ్చేసి షాపింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు. లేటెస్ట్ ట్రెండ్, కస్టమర్ల అభిరుచి మేరకు నూతన డిజైన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.
పట్టు, ఫ్యాన్సీ, స్పెషల్ ఫ్యాన్సీ చీరలతోపాటు చుడిదార్ డ్రెసెస్స్, మెటీరియల్స్, మెన్స్‌వేర్, ఉమెన్స్వేర్, గర్ల్స్వేర్, బాయ్స్వేర్లో సరికొత్త ఆఫర్స్ ఉన్నాయని పేర్కొన్నారు. పట్టు సారీస్‌లో రూ.1,499 నుంచి రూ.4,499 వరకు, ఫ్యాన్సీ సారీస్‌లో రూ.299 నుంచి రూ.1,499 వరకు కేజీ సేల్ ఉందన్నారు. అలాగే కాంబో ఆఫర్స్తోపాటు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అప్ టూ 61శాతం డిస్కౌంట్‌ను వినియోగదారుల కోసం ఇస్తున్నారు. బీహెచ్ఈఎల్ చౌరస్తాలో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను కొనుగోలుదారులు సందర్శించి ఈ క్రేజీ ఆఫర్స్‌ను సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కస్టమర్ల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కూడా ఉందని బీహెచ్ఈఎల్ సీఎంఆర్ స్టోర్ మేనేజర్ రమేశ్, అసిస్టెంట్ మేనేజర్ రాజేశ్ తెలిపారు.