జీఎస్టీలోకి ఏటీఎఫ్.. కేంద్రం కసరత్తు!

ముంబై: విమానాలను నడిపేందుకు వాడే ఫ్యూయల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు పౌర విమాన యాన శాఖ పని చేస్తున్నది. దీనిపై కసరత్తు చేయాలని ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు శుక్రవారం గ్లోబల్ ఏవియేషన్- ఎయిర్ కార్గో అంశంపై జరిగిన వర్చువల్ సదస్సులో విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు.
విమానాల నిర్వహణలో ఏటీఎఫ్ లేదా జెట్ ఫ్యూయల్ ఖర్చులే 45-55 శాతం. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఈ ఖర్చు అధికంగా ఉంటున్నది. దీంతో ఏటీఎఫ్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రాన్ని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలంటే జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రదీప్ సింగ్ ఖరోలా చెప్పారు.
దేశీయ గగనతలాన్ని పూర్తిస్థాయి వినియోగానికి తీసుకురావడానికి తీసుకున్న చర్యలను ప్రదీప్ సింగ్ ఖరోలా వెల్లడించారు. వివిధ రంగాలతో పాటు విమానయాన రంగం కూడా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. తట్టుకుని నిలబడిందని ఖరోలా అన్నారు. ఇందులో సరకు రవాణాదే కీలక పాత్ర అని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- civil aviation
- jet fuel
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

