CitiBank | రేపు సిటీ బ్యాంక్ ఆన్లైన్ సేవలకు అంతరాయం.. ఎప్పుడంటే?
City Bank | సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి 45 నిమిషాలు సేవలు నిలిపివేస్తున్నట్లు సిటీబ్యాంక్ తెలిపింది.

CitiBank |తమ బ్యాంక్ సేవలు సోమవారం 45 నిమిషాల సేపు నిలిచిపోతాయని ప్రైవేట్ బ్యాంక్ సిటీ బ్యాంక్ తన ఖాతాదారులకు మెసేజ్‌లు పంపింది. మెయింటెనెన్స్ పనుల కారణంగా ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున మూడు గంటల నుంచి 3.45 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఈ-మెయిల్స్ ద్వారా సమాచారమిచ్చింది.
ఈ టైమ్‌లో ప్రభావం పడే సర్వీసుల వివరాలివే:
• సిటీ బ్యాంక్ ఆన్లైన్, సిటీబ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్
• సెల్ఫ్ సర్వీస్ రిక్వెస్ట్‌లు
• ఐవీఆర్ సర్వీస్
క్రెడిట్ కార్డు వివాదం నెలకొంటే..?
సిటీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్‌పై ఏదేనీ వివాదం తలెత్తితే మాత్రం 24X7 సిటీ ఫోన్‌కు కాల్చేయాలని సూచించింది. భారత్‌లో క్రెడిట్ కార్డుల బిజినెస్‌లో గణనీయ వాటా కలిగిఉంది. దేశీయంగా క్రెడిట్ కార్డుల బిజినెస్‌లోకి ఎంటరైంది సిటీ బ్యాంక్. ఇప్పుడు దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా ఖాతాదారులు ఉన్నారు.
2009లో కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డుల బిజినెస్
భారత్‌లో 1902లోనే తొలి ఆఫీసును ప్రారంభించింది సిటీ బ్యాంక్. గణనీయ వాటాలు గల విదేశీ పెట్టుబడిదారు. 1993లో 24 గంటల ఫోన్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన తొలి బ్యాంకర్‌గా సిటీ బ్యాంక్ నిలిచింది. సిటీ టాప్ అండ్ పే విధానంతో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీపై ఆధారపడి 2009లో తదుపరి తరం కాంటాక్ట్‌లెస్ క్రెడిట్‌కార్డ్ పేమెంట్స్‌ను ప్రారంభించింది.
భారత్ నుంచి నిష్కమణపై ఏప్రిల్‌లో ప్రకటన
అయితే, భారత్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో సిటీ బ్యాంక్ ప్రకటించింది. భారత్ (ఆసియా)తోపాటు యూరప్, మిడిల్ఈస్ట్, ఆఫ్రికా రీజియన్లలోని 13 దేశాల్లో రిటైల్ బ్యాంకింగ్ సేవల నుంచి వైదొలుగతున్నట్లు వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- city bank
- credit card
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

