Chotu QR Code | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వినూత్న ఆలోచనలకు టీ హబ్‌లో ప్రోత్సాహం ఉంటుందని, అలా తాము ప్రోత్సహించిన స్టార్టప్‌లలో చోటు ఒకటని టీహబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు అన్నారు. శనివారం టీహబ్‌లో చోటు స్టార్టప్ రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను స్టార్టప్ వ్యవస్థాపకులు వై రవి, వంశీలతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లను ప్రారంభించాలన్న లక్ష్యంతో ఉన్న వారికి టీ హబ్ వేదికగా మారిందని, వేలాది మంది ఇక్కడ పలు స్టార్టప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
అలాంటి వాటిలో ఒకటి చోటు స్టార్టప్. ఈ స్టార్టప్ రూపొందించిన క్యూఆర్ కోడ్ స్థానికంగా ఉండే కిరాణా షాపుల్లో కొనుగోళ్లు చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాల్లో వెయ్యికి పైగా కిరాణా, బేకరి, కూరగాయల షాపులను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చామని, ఎవరైనా సరే ఈ వెబ్సైట్(https://start.chotu. com/)లింక్ ద్వారా తీసుకోవచ్చునన్నారు.