Vivo Y56 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. భారత్ మార్కెట్లోకి మిడ్ రేంజ్ సెగ్మెంట్లో సోమవారం అతి చౌక స్మార్ట్ ఫోన్.. వివో వై56 5జీ (Vivo Y56 5G) ఫోన్ ఆవిష్కరించింది. సూపర్ నైట్ సెన్సర్ గల ఈ ఫోన్ నుంచి చీకట్లో తీసే ఫోటోలు, వీడియోలు పూర్తి క్లారిటీతో వస్తాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది.
గత ఫిబ్రవరిలో 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ వివో వై56 5జీ ఫోన్ రూ.19,999లకు ఆవిష్కరించింది. తాజాగా 5జీబీ ర్యామ్ విత్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. వివో అధికారిక వెబ్సైట్లో బ్లాక్ ఇంజిన్, ఆరెంజ్ షిమ్మర్ కలర్ ఆప్షన్లలో ఫోన్ లభిస్తుంది. తాజాగా ఆవిష్కరించిన 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.16,999 పలుకుతుంది.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వివో వై56 5జీ ఫోన్ వస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ లెన్స్ కెమెరా ఎఫ్/1.8 అపెర్చర్ అండ్ సూపర్ నైట్ మోడ్‌లో వస్తుంది. సెకండ్ లెన్స్ కెమెరా 2-మెగా పిక్సెల్ ఎఫ్/2.4 అపెర్చర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ కెమెరా జత చేశారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్ గల ఫోన్ వర్చువల్‌గా 8 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. 12 జీబీ ర్యామ్ గల ఫోన్లో వర్చువల్‌గా 16 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్‌పై వివో వై56 5జీ ఫోన్ పని చేస్తుంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఓటీజీ, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ టైప్ సీ-పోర్ట్‌తోపాటు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఫేస్ అన్‌లాక్ తోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా జత చేశారు.