కార్పొరేట్లూ జర భద్రం.. ఏఐ ఏజెంట్ ఘటనతో కేంద్రం హెచ్చరికలు
స్వయంప్రతిపత్తి కలిగిన కృత్రిమ మేధస్సు (ఏఐ) ఏజెంట్లకు సంబంధించి కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్, ఇండియా (సీఈఆర్టీ-ఐఎన్) ఇచ్చిన కీలక హెచ్చరిక నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సూచించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : స్వయంప్రతిపత్తి కలిగిన కృత్రిమ మేధస్సు (ఏఐ) ఏజెంట్లకు సంబంధించి కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్, ఇండియా (సీఈఆర్టీ-ఐఎన్) ఇచ్చిన కీలక హెచ్చరిక నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొన్ని భారతీయ సంస్థలపై ఏఐ ఏజెంట్లు సైబర్ దాడులకు పాల్పడ్డారంటూ సీఈఆర్టీ-ఐఎన్ గురువారం సంచలన ప్రకటన చేసింది.
అయితే సదరు ఏఐ ఏజెంట్ల పేర్లు, కంపెనీల వివరాలుగానీ తెలియపర్చలేదు. సంస్థాగత క్లౌడ్, వెబ్ ఆస్తుల బలహీనతల్ని అవకాశంగా తీసుకుని చాట్బాట్ మాదిరిగా కాకుండా స్వేచ్ఛగా పలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయని సీఈఆర్టీ-ఇన్ తెలిపింది. ఈ క్రమంలోనే పెద్దగా ఎలాంటి ఆర్థిక నష్టం జరుగలేదంటూనే.. దీన్నో వార్నింగ్ బెల్గా కంపెనీలు పరిగణించాల్సిన అవసరం ఉందని కేంద్రం అప్రమత్తం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

