Telecom | డీఓటీ అడ్వైజరీ.. టెలికంశాఖ పేరిట ఫేక్ కాల్స్.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Telecom | చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఫోన్ నంబర్ డిస్ కనెక్ట్ చేస్తామన్న కాల్స్ ఫేక్ కాల్స్ అని, వాటిని నమ్మవద్దని టెలికం శాఖ అడ్వైజరీ జారీ చేసింది.
Telecom | రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు మొబైల్ ఫోన్ల యూజర్లకు ఫోన్ చేసి..చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో మొబైల్ నంబర్ డిస్ కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. దీనిపై కేంద్ర టెలికం శాఖ (డీవోటీ) మొబైల్ ఫోన్ యూజర్లకు అడ్వైజరీ జారీ చేస్తూ ఇవన్నీ ఫేక్ కాల్స్ అని స్పష్టం చేసింది. అటువంటి ఫోన్ కాల్స్ రాగానే రిపోర్ట్ చేయాలని సూచించింది. విదేశీ మొబైల్ ఫోన్ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్ చేసి మొబైల్ యూజర్లను తాము ప్రభుత్వాధికారులం అని నమ్మిస్తున్నారని శుక్రవారం జారీ చేసిన అడ్వైజరీలో తెలిపింది.
ఇటువంటి కాల్స్ చేసిన సైబర్ మోసగాళ్లు.. యూజర్ల వ్యక్తిగత సమాచారం తస్కరించి ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతుంటారని టెలికం శాఖ హెచ్చరించింది. టెలికం శాఖ తరఫున ఫోన్ చేయడానికి తాము ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదని స్పష్టం చేసింది. ఇటువంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమాచారం షేర్ చేసుకోవద్దని డీవోటీ వివరించింది.
మొబైల్ ఫోన్ యూజర్లు తమకు వచ్చిన మోసపూరిత ఫోన్ కాల్స్ విషయమై వెంటనే సంచార్ సాథీ పోర్టల్ (www.sancharsathi.gov.in)లో ఫిర్యాదు చేయాలని డీవోటీ పేర్కొంది. ఇదే వెబ్ సైట్ లో ‘ నో యువర్ మొబైల్ కనెక్షన్’ అనే ఆప్షన్ క్లిక్ చేసి యూజర్లు తమ ఫోన్ కనెక్షన్ల వివరాలు తెలుసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఇప్పటికే సైబర్ మోసాల భారీన పడితే 1930 హెల్ప్ లైన్ నంబర్ కి ఫోన్ చేయాలని, www.cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

