Additional DA for Central Employes | కేంద్ర ఉద్యోగులకు మళ్లీ డీఏ పెంపు..?
Additional DA for Central Employes | కేంద్ర ప్రభుత్వోద్యోగులకు మరోమారు డీఏ పెరుగనున్నది. అదే జరిగితే కనీస వేతనంలో 31% పెరుగుతుంది.

Additional DA for Central Employes | కేంద్ర ప్రభుత్వోద్యోగులకు నరేంద్రమోదీ సర్కార్ తీపి కబురందించింది. పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోమారు డేర్నెస్ అలవెన్స్ (డీఏ), డేర్నెస్ రిలీఫ్ (డీఆర్) పెంచనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ప్రకటించిన కరువు భత్యం (డీఏ) అమలులోకి వచ్చింది. ఇంతకుముందు 17% డీఏ చెల్లిస్తే, ఇప్పుడది 28 శాతానికి చేరుకున్నది. కనీస వేతనంలో 28 % డీఏ జూలై వేతనం నుంచి చెల్లిస్తున్నారు. హెచ్ఆర్ఏ కూడా 24 నుంచి 27 శాతానికి పెంచారు.
తాజాగా పండుగల సీజన్ వస్తున్నందున మరో మూడు శాతం డీఏ, మూడు శాతం డీఆర్ పెంచడానికి కేంద్రం చర్యలు చేపట్టనున్నది. అదే జరిగితే డీఏ 31%, డీఆర్ 31% పెరుగనున్నది. ఈ నెలాఖరులోగా కేంద్రం ప్రకటన చేయొచ్చు. అక్టోబర్ వేతనం నుంచి అమలులోకి రావచ్చునని భావిస్తున్నారు.
కేంద్రం ఉద్యోగులకు 28 శాతం డీఏ పెంచడంతో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు అదే శ్రేణిలో వేతనాలు పెంచాయి. దీంతో ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, అసోం, జార్ఖండ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగాయి. కర్ణాటక మాత్రం 21.5 శాతం డీఏ మాత్రమే పెంచింది.
28 శాతం డీఏ పెంచడంతో కనీస వేతనం రూ.20 వేలు ఉండేదీ.. తాజాగా మూడు శాతం పెంచడం వల్ల మరో 600 కనీస వేతనంలో కలుస్తుంది. దీని ప్రకారం వేతనంలో రూ.6,200 పెరుగనున్నదని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- central employes
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

