Mobile Numbers | 70 లక్షల మొబైల్ నంబర్లను తొలగించిన కేంద్రం.. ఎందుకంటే..
Mobile Numbers |డిజిటల్ మోసాలను అరికట్టేందుకు అనుమానిత ఆర్థిక లావాదేవీలను జరుపుతున్న 70 లక్షల మొబైల్ నెంబర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు.
Mobile Numbers |న్యూఢిల్లీ, నవంబర్ 28: డిజిటల్ మోసాలను అరికట్టేందుకు అనుమానిత ఆర్థిక లావాదేవీలను జరుపుతున్న 70 లక్షల మొబైల్ నెంబర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. ఆర్థిక సైబర్ భద్రత, పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంగళవారం ఓ సమావేశం జరిగింది. దీనికి జోషీనే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రకమైన సమావేశాలు ఇకపైనా జరుగుతాయని, వచ్చే ఏడాది జనవరిలో తదుపరి సమావేశం ఉంటుందని చెప్పారు. ఇక డిజిటల్ మోసాల నివారణకు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలో మోసానికి సంబంధించి మాట్లాడుతూ రాష్ర్టాలను దీనిపై దృష్టి పెట్టాలని కోరినట్టు, వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉండేలా చూడాలన్నట్టు చెప్పారు.
వ్యాపారుల కేవైసీ ప్రామాణికతకు సంబంధించీ చర్చ జరిగింది. కాగా, సైబర్ మోసాలపై సమాజంలో అవగాహన పెరగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా జోషి వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ప్రభుత్వ రంగానికి చెందిన యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)ల్లో ఇటీవలి కాలంలో డిజిటల్ మోసాలు జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐఎంపీఎస్ ద్వారా ఖాతాదారుల ఖాతాల్లోకి యూకో బ్యాంక్ నుంచి పొరబాటున రూ.820 కోట్లు బదిలీ అయ్యాయి. దీన్ని గుర్తించిన బ్యాంక్.. ఆ తర్వాత సదరు ఖాతాలను బ్లాక్ చేసి రూ.649 కోట్లు రాబట్టింది. ఇది ఎలా జరిగిందన్నదానిపై బ్యాంక్ వివరణ ఇవ్వాల్సి ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

