PAN-Aadhar Link | సీబీడీటీ కీలక ప్రకటన.. చలాన్ చెల్లిస్తే వెబ్ సైట్లో ఇలా పాన్-ఆధార్ అనుసంధానం..!
PAN-Aadhar Link | పాన్-ఆధార్ అనుసంధానానికి ఫైన్ చెల్లించిన వారు ఈ-చలాన్ డౌన్ లోడ్ చేసుకోకుండానే పాన్-ఆధార్ అనుసంధానం పూర్తి చేయవచ్చునని సీబీడీటీ తెలిపింది.
PAN-Aadhar Link |పాన్ కార్డు-ఆధార్ అనుసంధానానికి గడువు ముగియబోతున్న వేళ శుక్రవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొన్ని గంటల ముంగిట కీలక ప్రకటన చేసింది. ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి 2023 జూన్ 30తో గడువు ముగుస్తున్న సంగతి తెలిసిందే.
ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి ఇప్పటికే ఫైన్ చెల్లించిన వారికి చలాన్ డౌన్ లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చలాన్ పేమెంట్ చేసిన తర్వాత ఆదాయం పన్ను విభాగం వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ కావాలని, ఈ-పే టాక్స్ సెక్షన్ లో పేమెంట్ పూర్తయిందా.. లేదా తెలుసుకోవచ్చునని ఆదాయం పన్ను విభాగం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
లావాదేవీలు పూర్తయినట్లు చూపితే పాన్-ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకోవచ్చునని వెల్లడించింది. అందుకోసం చలాన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చలాన్ పేమెంట్ పూర్తయ్యాక పాన్ కార్డు హోల్డర్ల రిజిస్టర్డ్ ఈ-మెయిల్ కు రశీదు వస్తుంది. నగదు చెల్లింపు పూర్తయినా, ఆధార్-పాన్ కార్డు లింకింగ్ పూర్తి కాని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- aadhar
- Business news
- cbdt
- pan car
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

