అభివృద్ధికి కేరాఫ్ తెలంగాణ

- క్యాపెక్స్ వినియోగంలో అగ్రగామి
ముంబై, నవంబర్ 25: అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత మరోసారి బయటపడింది. వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన వార్షిక మూలధన వ్యయ నిధుల వినియోగంలో తెలంగాణే అగ్రగామిగా ఉన్నట్లు ఓ తాజా నివేదికలో తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో రాష్ర్టాలు చేసిన మూలధన వ్యయం పట్టికలో తెలంగాణ ప్రభుత్వం టాప్‌లో నిలిచినట్లు కేర్ రేటింగ్స్ తెలిపింది. కేరళ కూడా ముందున్నట్లు పేర్కొన్నది. ఈ ఆర్థిక సంవత్సరం కోసం కేటాయించిన రూ.28,518 కోట్ల మూలధన వ్యయం నిధుల్లో తొలి ఆరు నెలల్లో రూ.14,814 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసేనట్లు కేర్ రేటింగ్స్ వెల్లడించింది. ఇది 51.9 శాతంతో సమానం.
కేంద్రానిదీ అంతంతే..
మూలధన వ్యయంలో కేంద్ర ప్రభుత్వం సైతం వెనుకబడే ఉన్నది. రూ.5.13 లక్షల కోట్లకుగాను రూ.2.09 లక్షల కోట్లకే పరిమితమైంది. అంటే 41 శాతం దాటలేదు. గత ఆర్థిక సంవత్సరం ఇది 56 శాతంగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 54 శాతంగా ఉండటం విశేషం. కాగా, దేశంలోని 24 రాష్ర్టాలు ఈ ఆర్థిక సంవత్సరం కోసం రూ.5.76 లక్షల కోట్ల మూలధన వ్యయం నిధులను కేటాయించుకున్నాయి. అయినప్పటికీ ప్రథమార్ధం ఖర్చు రూ.1,63,868 కోట్ల వద్దే ఉన్నట్లు కేర్ రేటింగ్స్ తెలియజేసింది. ఇది 28.4 శాతంతో సమానం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bussiness
- bussiness news
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

