హైదరాబాద్, మే 4: ప్రముఖ ఐటీ సేవల సంస్థ క్యాప్‌జెమినీ..హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ ఎక్సేంజ్‌ను ఏర్పాటు చేసింది.
ఆర్థిక సేవలు, లైఫ్‌సెన్సెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కన్జ్యూమర్ గూడ్స్ సేవలను మరింత విస్తరించడానికి ఈ సెంటర్ దోహదం చేయనున్నదని కంపెనీ సీనియర్ డైరెక్టర్ రంజన్ ప్రధాన్ తెలిపారు. స్టార్టప్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి ఈ సెంటర్ చాలా కీలకంగా మారనున్నదన్నారు.