ఎఫ్డీ వడ్డీరేట్లను పెంచిన కెనరా బ్యాంక్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వడ్డీరేట్లను పెంచింది. వివిధ కాలపరిమితుల ఆధారంగా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
న్యూఢిల్లీ, మార్చి 3: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వడ్డీరేట్లను పెంచింది. వివిధ కాలపరిమితుల ఆధారంగా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. మారిన వడ్డీరేట్లు ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చాయని ఓ ప్రకటనలో కెనరా బ్యాంక్ తెలియజేసింది. ఏడాది కాలపరిమితి ఎఫ్డీలపై వడ్డీరేటును 5.1 శాతానికి పెంచిన బ్యాంక్.. ఏడాది-రెండేండ్ల ఎఫ్డీలకు 5.15 శాతం వడ్డీరేటును ఆఫర్ చేసింది. 2-3 ఏండ్ల ఎఫ్డీలకు 5.2 శాతం, 3-5 ఏండ్లకు 5.45 శాతం చొప్పున వడ్డీరేట్లను ప్రకటించింది. ఇక 5-10 ఏండ్ల ఎఫ్డీలపై గరిష్ఠంగా 25 బేసిస్ పాయింట్లను పెంచుతూ వడ్డీరేటును 5.5 శాతంగా నిర్ణయించారు. కాగా, సీనియర్ సిటిజన్లు చేసే ఎఫ్డీలన్నింటిపై వడ్డీరేటు అదనంగా 50 బేసిస్ పాయింట్లు ఎక్కువే ఉంటుందని ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ స్పష్టం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

