కెనరా బ్యాంక్ లాభం 3,606 కోట్లు
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,606 కోట్ల నికర లాభాన్ని గడించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,606 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,525 కోట్ల లాభం కంటే ఇది 43 శాతం అధికం. వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం పెరగడంతోపాటు కేటాయింపులు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
గత త్రైమాసికానికిగాను బ్యాంక్‌కు నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 19.76 శాతం ఎగబాకి రూ.8,903 కోట్లకు చేరుకున్నది. మొండి బకాయిల కోసం బ్యాంక్ కేటాయింపులు రూ.3,637 కోట్ల నుంచి రూ.2,608 కోట్లకు తగ్గినట్టు పేర్కొంది.
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 6.37 శాతం నుంచి 4.76 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ1.41 శాతానికి పరిమితమైంది. బ్యాంక్ అంతర్జాతీయ వ్యాపారం 10 శాతం పెరిగి రూ.21,56,185 కోట్లకు చేరుకున్నది. గత నెల చివరినాటికి బ్యాంక్ 9,518 శాఖలు కలిగివున్నది. వీటిలో 3,059 శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, 1,895 శాఖలు అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

