హైదరాబాద్, జూన్ 28: కెనరా బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.12 లేదా 120 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్ ప్రతిపాదనకు బ్యాంక్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన బ్యాంక్ 21వ వార్షిక సాధారణ సమావేశం జరిగింది. బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విజయ్ శ్రీరంగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంక్ ఆడిటింగ్ బ్యాలెన్స్ షీట్‌పై ప్రధానంగా సమీక్షించారు.