Credit Card Loan | ఎమర్జెన్సీ ఫండ్ కోసం క్రెడిట్ కార్డుపై పర్సనల్ లోన్ లభిస్తుందా?!
Credit Card Loan | క్రెడిట్ కార్డుతో అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్ లోన్ పొందొచ్చు. సాధారణ వ్యక్తిగత రుణంతో పోలిస్తే కాసింత వడ్డీ ఎక్కువ.
Credit Card Loan | ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు తప్పనిసరి. ఏ పని చేసినా కుటుంబ అవసరాలకు సరిపడా సంపాదిస్తే సరి.. కొన్ని సార్లు ఎమర్జెన్సీగా కొంత సొమ్ము అవసరం అవుతుంది. అటువంటి సందర్భాల్లో పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.. బంగారం తాకట్టు పెట్టి కూడా లోన్ తీసుకోవడం తేలిక.. ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద కూడా రుణం రూపేణా కొంత నగదు తీసుకోవచ్చు. అదెలాగో ఓ లుక్కేద్దాం..
క్రెడిట్ కార్డులను వాడి వస్తువుల కొనుగోళ్లు చేయొచ్చు. ఏటీఎం నుంచి నిర్ధిష్ట లిమిట్ వరకు క్యాష్ విత్ డ్రా చేయొచ్చు. వీటితోపాటు క్రెడిట్ కార్డు ఆధారంగా పర్సనల్ లోన్ పొందే వెసులుబాటు కూడా ఉంది. అదీ మీ సిబిల్ స్కోర్.. క్రెడిట్ కార్డును మీరు వాడుతున్న తీరును బట్టి సంబంధిత క్రెడిట్ కార్డు జారీ సంస్థ.. బ్యాంకు మీకు రుణం మంజూరు చేస్తాయి.
ఇప్పుడంతా డిజిటల్ మయమేగా.. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఒక్క క్లిక్ చేస్తే సరి.. మీకు అవసరమైన లోన్ వచ్చేస్తుంది. ఇందుకోసం ఎటువంటి గ్యారంటీలు సమర్పించాల్సిన అవసరం లేదు. నిర్ణీత గడువులోగా.. నిర్ధిష్ట వడ్డీ రేటుపై క్రెడిట్ కార్డు ఆధారిత పర్సనల్ లోన్ పొందొచ్చు. ఇక సాధారణంగా బ్యాంకులు ఇచ్చే పర్సనల్ లోన్లతో పోలిస్తే.. క్రెడిట్ కార్డుపై తీసుకునే వ్యక్తిగత రుణాలపై కాసింత ఎక్కువ వడ్డీ చెల్లించాలి మరి.
క్రెడిట్ కార్డుతో క్యాష్ విత్ డ్రా చేయడం.. పర్సనల్ లోన్ తీసుకోవడం వేర్వేరు అన్న సంగతిని పరిగణనలోకి తీసుకోవాలి. క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకుంటే.. మీ కార్డు లిమిట్ తగ్గుతుంది. దానిపై 48 శాతం వరకు వడ్డీ విధిస్తాయి సదరు క్రెడిట్ కార్డు జారీ సంస్థలు. బిల్లింగ్ తేదీ నాడే మొత్తం బాకీ పే చేయాలి.
క్రెడిట్ కార్డుపై పన్సనల్ లోన్ తీసుకుంటే 36 నెలల్లోపు పే చేసే వెసులుబాటు ఉంటుంది. కొన్ని బ్యాంకులు గానీ, క్రెడిట్ కార్డు సంస్థలు గానీ ఐదేండ్ల వరకు రుణం చెల్లింపు గడువు ఇస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డు పర్సనల్ లోన్ మీద వడ్డీ కూడా 16-18 శాతం మధ్య విధిస్తారు. పర్సనల్ రుణానికి, కార్డు పరిమితికి ఎటువంటి సంబంధం ఉండదు కూడా.
క్రెడిట్ కార్డు పొందినప్పుడు మీరు అందచేసిన డాక్యుమెంట్స్, మీ ఆదాయ వివరాలను బట్టే క్రెడిట్ కార్డు ఆధారిత పర్సనల్ లోన్ లభిస్తుంది. కనుక దీనిపై పర్సనల్ లోన్ పొందడానికి అదనంగా పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఇక క్రెడిట్ కార్డు వాడకాన్ని బట్టి ముందుగానే పర్సనల్ లోన్ మంజూరవుతుంది. అవసరమైనప్పుడు క్షణాల్లో ఈ రుణం పొందొచ్చు.
అత్యవసర పరిస్థితుల్లో మనీ అవసరమైనప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డుపై పర్సనల్ లోన్ తీసుకోవాలి. ఇతర ఆప్షన్లు ఉంటే వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణ పర్సనల్ రుణంతో పోలిస్తే క్రెడిట్ కార్డుపై తీసుకునే వ్యక్తిగత రుణానికి అధిక వడ్డీ చెల్లించాలి సుమా..
ప్రతి నెలా మీరు చెల్లించే వివిధ రుణాల నెలవారీ వాయిదా (ఈఎంఐ)లు.. మీ ఆదాయంలో 40 శాతం మించకుండా చూసుకోవాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇక క్రెడిట్ కార్డు బిల్లులు టైమ్ ప్రకారం పే చేయకుంటే రుణాల ఊబిలో చిక్కుకోవడంతోపాటు సిబిల్ స్కోర్ .. లోన్ హిస్టరీ దెబ్బ తింటాయని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

