షాకింగ్: చాక్లెట్ల క్యాడ్బరీ ఫ్రాడ్.. సీబీఐ కేసు నమోదిలా..

న్యూఢిల్లీ: క్యాడ్బరీ ఇండియా.. ఒక చాక్లెట్ కంపెనీ.. రాయితీలు పొందడానికి వాస్తవాలను తప్పుదోవ పట్టించింది. అధికారులతో కలిసి కుట్ర పన్నింది. అవినీతికి పాల్పడినందుకు క్యాడ్బరీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. పన్ను రాయితీలను పొందడానికి 2009-11 మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్‌లో రెండో యూనిట్ ఏర్పాటు చేయకున్నా.. చేశానని పత్రాలు సమర్పించింది. కొన్ని రికార్డులు తారుమారు చేసి ప్రాంతాల వారీ రాయితీలను పొందింది. తద్వారా ఫైవ్ స్టార్, జెమ్స్ చాక్లెట్స్ని తయారు చేస్తున్న క్యాడ్బరీ రూ. 241 కోట్ల మేర పన్ను లబ్ధిని పొందిందని సీబీఐ ఆరోపించింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డీలో క్యాడ్బరీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి మరో పదేండ్లు అదనంగా సుంకాలు, పన్ను రాయితీలు పొందేలా ప్రతిపాదనలు అందించింది. ఆ తర్వాత కొత్త యూనిట్ నిర్మించకుండా, 2005 నుండి ఉన్న ఫ్యాక్టరీని కొంత విస్తరించింది. 2010 జులైలో రెండో యూనిట్ లైసెన్స్ తీసుకుంది. పన్ను మినహాయింపులు పొందడానికి విధించిన గడువు ముగిసి 4 నెలలు దాటింది. అంతేకాదు.. రెండవ యూనిట్‌కూ పన్నురాయితీ పొందే అర్హత లేదు. దీంతో సెంట్రల్ ఎక్సైజ్ అధికారులకు మధ్యవర్తుల ద్వారా లంచాలిచ్చి రూ.241 కోట్ల మేర పన్ను రాయితీలను పొందింది. ఈ క్రమంలో… రికార్డుల తారుమారు, లంచాల వ్యవహారం నడిచిందని సీబీఐ పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

