Tata TiagoEV | టియాగో ఈవీకి బంపర్ రెస్పాన్స్.. తొలి రోజే 10 వేల బుకింగ్స్.. అందుకే టాటా మోటార్స్!
Tata Tiago EV | చౌక ఎలక్ట్రిక్ కారు టియాగో ఈవీకి ప్రి బుకింగ్స్‌కు వచ్చింది. తొలి రోజే 10 వేల బుకింగ్స్ వచ్చాయి.
Tata Tiago EV | దేశంలోనే అతి చౌక విద్యుత్ కారు టాటా టియాగో ఈవీకి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు పది వేల బుకింగ్స్ నమోదయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తొలి రోజే బుకింగ్స్ 10 వేల మార్క్‌ను దాటేశాయి. తొలి 10 వేల మంది కస్టమర్లకు రూ.8.49 లక్షలకే టాటా టియాగో ఈవీ కారు విక్రయిస్తామన్న టాటా మోటార్స్.. తాజాగా ఈ ఆఫర్ మరో 10 వేల మందికి పొడిగించింది.
టాటా టియాగో ఈవీ కార్ల పట్ల కస్టమర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ తమకు సంతోషాన్నిచ్చిందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేశ్ చంద్ర తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఇంట్రడ్యూసరీ ప్రైస్ ఆఫర్ పొడిగించాలని నిర్ణయించాం అని చెప్పారు. వచ్చే డిసెంబర్లో కారు టెస్ట్ డ్రైవింగ్ మొదలవుతుందని, 2023 జనవరిలో డెలివరీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
కారు బుక్ చేసుకున్నా ఇంట్రడ్యూసరీ ధరకు టియాగో ఈవీ కారు మీకు అందుతుందన్న గ్యారంటీ లేదు. తొలి 20 వేల మంది కస్టమర్లకు మాత్రమే ఈ ఇంట్రడ్యూసరీ ధర రూ.8.49 లక్షలు. అందునా తొలి పది వేల మంది కస్టమర్లలో రెండు వేల బుకింగ్స్.. ఇప్పటికే టాటా ఈవీ కార్లు వాడుతున్న కస్టమర్ల కోసం రిజర్వు చేశారు. కారు బుకింగ్ డేట్, టైం, కారు మోడల్, వేరియంట్ తదితర అంశాలను బట్టి ఇంట్రడ్యూసరీ ధరకు టియాగో ఈవీ కారు పొందొచ్చు.

టాటా టియాగో ఈవీ కారు బుకింగ్స్ కోసం తొలిరోజు కస్టమర్లు వెల్లువెత్తడంతో టాటా మోటార్స్ వెబ్సైట్లో సోమవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీనిపై కస్టమర్లు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదులపై టాటా మోటార్స్ స్పందిస్తూ.. వేల మంది కస్టమర్లు బుకింగ్స్ కోసం ఒకేసారి ప్రయత్నించడంతో తమ వెబ్సైట్ స్లోగా నడుస్తుందని, కస్టమర్లకు జరిగిన అంతరాయానికి క్షమాపణలు తెలిపింది. టాటా టియాగో ఈవీ కారు కావాలనుకున్న వారు రూ.21 వేలు పే చేసి బుక్ చేసుకోవచ్చు. మిగతా మొత్తం ఖాతాదారులు తాము ఎంచుకున్న డీలర్‌షిప్‌కు చెల్లించి కారు సొంతం చేసుకోవచ్చు.
ఐదు కలర్స్ ఆప్షన్లలో లభించే టాటా టియాగో ఈవీ కారుకు మాత్రమే రూ.8.49 లక్షల స్టార్టింగ్ ధర వర్తిస్తుంది. దేశంలోనే అత్యంత చౌక విద్యుత్ కారు ఇది. సింగిల్ చార్జింగ్‌తో 315 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్థ్యం దీని స్పెషాలిటీ. డీసీ ఫాస్ట్ చార్జర్‌తో టియాగో ఈవీ కారు బ్యాటరీ 57 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

