TV Cable Bill | సామాన్యులకు షాక్.. ఫిబ్రవరి 1 నుంచి కేబుల్ బిల్లు తడిసి మోపెడు..!
TV Cable Bill | వివిధ టెలివిజన్ చానెళ్ల సబ్ స్క్రిప్షన్ (కేబుల్ బిల్లు) వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇండియా కాస్ట్ 20-25 శాతం, జీ ఎంటర్ టైన్ మెంట్ 10 శాతం వరకూ, సోనీ 10 శాతం వరకూ పెంచనున్నాయి.
TV Cable Bill | ఇంట్లో ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం.. రోజువారీ వార్తలు, ఇతర సమాచారం కోసం టీవీ చానెళ్లు వీక్షిస్తుంటాం.. కరోనా మహమ్మారితో సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్ల కాలం వచ్చేసింది. కరోనా వేళ అందరూ వర్క్ ఫ్రం హోం కింద పని చేయడం, లెర్నింగ్ ఫ్రం హోం ద్వారా పాఠాల బోధన అంతా ఆన్ లైన్ లోనే సాగింది. ఆ టైంలోనే అన్ని టీవీ చానెళ్లు మొబైల్ ఫోన్లలో కొన్ని కార్యక్రమాలు ఫ్రీగా అందుబాటులోకి తెచ్చాయి. కానీ, ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
ధరలతోపాటు కంటెంట్ ఖర్చులు పెరిగి పోవడంతో ఆయా టీవీ చానెళ్ల సంస్థలకు ఖర్చులు ఎక్కువయ్యాయి. వాటిని వినియోగదారులపై మోపేందుకు బ్రాడ్ కాస్టర్లు సిద్ధం అయ్యాయి. దేశంలోని ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థల్లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా, వయాకాం 18 సంస్థలు తమ ఖాతాదారుల నెలవారీ టీవీ బిల్లులు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
భారీగా స్పోర్ట్స్ ఈవెంట్లు ప్రసారం చేసే నెట్ వర్క్ 18, వయాకాం18 డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇండియా కాస్ట్.. తమ కస్టమర్లపై చానెళ్ల సబ్ స్క్రిప్షన్ చార్జీ 20-25 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించాయి. జీ ఎంటర్టైన్మెంట్ 9-10 శాతం, సోనీ 10-11 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. డిస్నీ స్టార్ ఎంత చార్జీ పెంచుతున్నట్లు వెల్లడించలేదు. ప్రతిపాదిత చార్జీల పెంపుపై రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ (ఆర్ఐఓ)లో ప్రచురించిన 30 రోజుల తర్వాత పెంచిన సబ్స్క్రిప్షన్ చార్జీలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి బ్రాడ్ కాస్టర్ల సబ్స్క్రిప్షన్ చార్జీలు పెరగనున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

