SBI Bank | రుణ గ్రహీతలకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ..! తగ్గనున్న రుణాల వడ్డీ..!
SBI Bank | ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లోన్ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. రుణాల రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకు నుంచి వారికి సైతం భారం స్వల్పంగా తగ్గనున్నది.
SBI Bank | ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లోన్ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. రుణాల రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం
బ్యాంకు నుంచి వారికి సైతం భారం స్వల్పంగా తగ్గనున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రేపోరేటును తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎస్బీఐ రెపో లింక్డ్ లెండింగ్ రేటు
(RLLR) 25 బేసిస్ పాయింట్లు తగ్గి 8.25 శాతానికి చేరుకుంది. ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)ను 8.65 శాతానికి ఎస్బీఐ తగ్గించింది. సవరించిన రేట్లు ఈ నెల 15 నుంచి
అమలులోకి వస్తాయని బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. ఎస్బీఐ డిపాజిట్ రేట్లను కూడా 10-25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. రూ.3 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం, 1-2 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గించగా 6.70 శాతానికి చేరనున్నది. 2 నుంచి మూడేళ్ల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న డిపాజిట్లపై 7 శాతానికి బదులుగా 6.90 శాతం వడ్డీ చెల్లించనున్నది. రూ.3 కోట్ల కంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో.. 180 రోజుల నుంచి 210 రోజుల మెచ్యూరిటీ వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి చేర్చింది.
211 రోజుల నుంచి ఏడాది లోపు మెచ్యూరిటీ వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.50 శాతానికి చేరనున్నది. అలాగే ఒకటి నుంచి రెండేళ్ల కొత్త వడ్డీ రేటు ఇప్పుడు 7 శాతం నుండి 6.80 శాతంగా తగ్గనున్నది. మరోవైపు, 2-3 సంవత్సరాలకు కొత్త వడ్డీ రేటు 7 శాతం నుండి 6.75 శాతంగా ఉంటుంది. అమృత్ వృష్టిలో సాధారణ పౌరులకు 7.05శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55శాతం వడ్డీ చెల్లించనున్నది. అదే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.75 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇతర ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ఇతే అత్యల్పం. రూ.50 లక్షలకు కంటే ఎక్కువ ఉండే నిల్వలపై వడ్డీ 3.25 శాతం చెల్లించనున్నది. తగ్గించిన వడ్డీ రేట్లు ఈ నెల 12 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.3శాతం వడ్డీని అందించే 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ స్కీమ్‌ని ఉపసంహరించుకుంది. ముంబయికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో కొత్త, ప్రస్తుత కస్టమర్లకు సైతం ప్రయోజనం ఉంటుందని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

