హైదరాబాద్, జూలై 20: బొండాడ ఇంజినీరింగ్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. గుజరాత్లో ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ నిర్మించతలపెట్టిన 100 మెగావాట్ల వనదైమ్ రెడాక్స్ ఫ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌కు సంబంధించి ఆర్డర్ లభించింది.
ఈ ప్రాజెక్టును డెలక్ట్రిక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి బొండాడ పదేండ్లపాటు ఆపరేషన్ అండ్ మెంటనెన్స్ చేయాల్సివుంటుందని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ ప్రాజెక్టు విలువను మాత్రం సంస్థ వెల్లడించలేదు.