టీ-హబ్‌తో బోయింగ్ దోస్తీ
- స్టార్టప్‌ల ప్రోత్సాహమే లక్ష్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 5: టీ-హబ్‌తో బోయింగ్ ఇండియా జట్టు కట్టింది. ఈ ఏడాదికిగాను బోయింగ్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ (బిల్డ్) కార్యక్రమాన్ని సోమవారం బోయింగ్ ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలోనే టీ-హబ్ హైదరాబాద్‌సహా ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ మద్రాస్, ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ భువనేశ్వర్‌లతో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నది.
ఇందులో భాగంగా యూనివర్సిటీ విద్యార్థులు, దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మొదలవుతున్న స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులను బోయింగ్ ఆహ్వానిస్తున్నది. ఆచరణాత్మక వ్యాపారానికి అనువైన ఆలోచనల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతున్నట్టు బోయింగ్ తెలిపింది. మొబిలిటీ, స్పేస్, కనెక్టివిటీ, ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ, ఎంటర్ప్రైజ్ డిజిటల్ సొల్యూషన్స్, స్టస్టెయినబిలిటీ, డాటా అనలిటిక్స్, ఏఐల్లో ఈ సందర్భంగా దరఖాస్తులను ఆహ్వానించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

