అందరి కోసం బీమా సుగమ్
దేశ ప్రజలందరికీ 2047కల్లా బీమా అందాలనే లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ.. ఓ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రతిపాదించింది.
- ఓ ఆన్లైన్ వేదికను ప్రతిపాదించిన ఐఆర్డీఏఐ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: దేశ ప్రజలందరికీ 2047కల్లా బీమా అందాలనే లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ.. ఓ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రతిపాదించింది. పాలసీదారుల ప్రయోజనాల రక్షణ, సాధికారత కోసం ‘బీమా సుగమ్’ పేరుతో ఇన్సూరెన్స్ ఎలక్ట్రానిక్ వేదికను తేవాలని ఐఆర్డీఏఐ పేర్కొన్నది. పాలసీ కొనుగోలుదారులకు కావాల్సిన, అవసరమైన అన్నీ ఇందులో లభించేలా దీన్ని సిద్ధం చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు సూచించింది. బీమా సంస్థలు, మధ్యవర్తులు, ఏజెంట్లు, ఇతర భాగస్వాములందరికీ ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నట్టు అభిప్రాయపడింది. బీమా సుగమ్ ఏర్పాటుకు కావాల్సిన నిధులను బీమా కంపెనీలు సమకూర్చాలన్నది.
‘ఫ్రీ లుక్’ వ్యవధి 30 రోజులు!
పాలసీదారులు తాము తీసుకున్న పాలసీలో నిబంధనలు, షరతులు నచ్చకపోతే వాటిని పేర్కొంటూ తిరిగి దాన్ని వెనక్కిచ్చేందుకున్న గడువు (ఫ్రీ లుక్ పీరియడ్)ను 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. అలాగే జీవిత బీమా పాలసీలకు నామినేషన్ తప్పనిసరి అని కూడా చెప్తున్నది. పైన పేర్కొన్న ఈ ప్రతిపాదనలన్నింటికి సంబంధించి ముసాయిదాను విడుదల చేయగా.. దీనిపై బీమా కంపెనీలు, ఇండస్ట్రీ భాగస్వాములు మార్చి 4కల్లా తమ అభిప్రాయాలను తెలియపర్చాలన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

