మాదాపూర్, జనవరి 31: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ సామ్‌సంగ్‌నకు చెందిన అధునాతన ఫీచర్లతో కూడిన గెలాక్సీ ఎస్ 24 సిరీస్ మొబైల్ ఫోన్ బిగ్”సి’ షోరూంలలో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ను బిగ్”సి’ ఫౌండర్ బాలుచౌదరితో కలిసి ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ … శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24లో ఆల్ట్రా, ఎస్ 24 ప్లస్‌తో మార్కెట్లోకి విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బాలు చౌదరి మాట్లాడుతూ.. గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ఫోన్లలో అత్యంత అధునాతన ఫీచర్స్ కలిగివున్నాయని, లైవ్ ట్రాన్స్‌లేట్, టు-వే రియల్ టైం వాయిస్, చాట్ అసిస్ట్, ఫోన్ కాల్స్ టెక్ట్స్ ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రిటర్, ఆండ్రాయిడ్ నోట్ అసిస్ట్, ట్రాన్స్‌స్క్రిప్ట్ అసిస్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉన్నాయని, విజవల్ ఇంజన్, క్వాడ్ టెలి సిస్టం, 5ఎక్స్ ఆన్టికల్ జూమ్ లెన్స్, ఎన్ హ్యన్స్ డిజిటల్ జూమ్, నైటోగ్రపీ వంటి ఫీచర్లను పొందుపరిచినట్లు తెలిపారు.