హైదరాబాద్, అక్టోబర్ 13: మొబైల్స్ రిటైల్ విక్రయ సంస్థల్లో అగ్రగామి సంస్థ బిగ్ ‘సి’..దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ఈ ధమాకా ఆఫర్లలో భాగంగా ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్‌తోపాటు రూ.4 వేల వరకు విలువైన ఖచ్చితమైన బహుమతిని అందిస్తున్నట్టు కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి తెలిపారు. అలాగే మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ కొనుగోలుపై స్మార్ట్ వాచ్‌తోపాటు 5 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్, లాయల్టీ పాయింట్ ఆఫర్, 1+1 ఎక్సేంటెడ్ వ్యారెంటీ, స్మార్ట్ టీవీ ఆఫర్లు అందిస్తున్నట్టు తెలిపారు.