SUV Car Sales | కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా విశాలంగా ఉన్న ఎస్యూవీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గత నెల కార్ల సేల్స్ ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. గత నెలలో 3,34,800 కార్లు అమ్ముడు పోగా, వాటిలో 47 శాతం ఎస్యూవీలదే. హ్యుండాయ్ క్రెటాతోపాటు టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా మెరిశాయి.
మొత్తం టాప్-10 ఎస్యూవీ కార్లలో హ్యుండాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి రెండు మోడల్ కార్లు, కియా మోటార్స్ నుంచి ఒక మోడల్ కారు టాప్లో ఉన్నాయి. మళ్లీ మారుతి సుజుకి మూడు మోడల్స్ కార్లతో అగ్రస్థానంలో కొనసాగింది. హ్యుండాయ్ క్రెటా అత్యధికంగా 14,449 యూనిట్లు విక్రయించింది. తర్వాతీ స్థానంలో టాటా నెక్సాన్ 14,423, మారుతి సుజుకి బ్రెజా 13,398 కార్లు విక్రయించాయి.
టాటా పంచ్ ఇంప్రెస్సివ్ గా 11,124, హ్యుండాయ్ వెన్యూ 10,213, ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన ఫ్రాంక్స్ 9,863 యూనిట్లు విక్రయించాయి.పాపులర్ మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో (ఎన్, క్లాసిక్) 9318 కార్లు, మారుతి సుజుకి 8877 యూనిట్లు, కియా సొనెట్ 8251 కార్లు విక్రయించాయి.