Best Investment Schemes | గ్యారంటీ రిటర్న్స్‌కు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్.. ఇవీ డిటైల్స్
Best Investment Schemes | పోస్టాఫీసు టైం డిపాజిట్ మొదలు డెట్ ఫండ్స్, కార్పొరేట్స్ ఫండ్స్, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో మంచి రిటర్న్స్ వస్తాయి.
Best Investment Schemes | కాసింత ఎక్కువ ఆదాయం సంపాదన పరులు తక్షణ కుటుంబ అవసరాలు తీరిపోగా, మిగిలిన సొమ్ము ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ టూల్స్లోనూ క్యాటగిరీలు ఉన్నాయి. రిస్క్ ఉన్న పథకాలు, రిస్క్ లేని స్కీమ్స్, గ్యారంటీ రిటర్న్స్ హామీతో కూడిన పథకాలున్నాయి. స్వల్ప కాలిక అవసరాలతోపాటు కుటుంబ దీర్ఘ కాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే.. మెచ్యూరిటీ కావడానికి ఏండ్ల సమయం పడుతుంది.
అటువంటి పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్ఎస్సీ) వంటి స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారు మెచ్యూరిటీ డేట్ కోసం ఆరేండ్ల నుంచి 15 ఏండ్ల వరకు వేచి చూడాలి. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారు దీర్ఘకాలిక దృష్టితో కొనసాగిస్తే లాభాలు పొందొచ్చు. స్వల్పకాలిక దృష్టితో స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ వల్ల నష్టభయం ఎక్కువ. ఇక నష్టాల్లేకున్నా.. తక్కువ లాభాలిచ్చే స్కీమ్‌లు ఉన్నాయి.. అవేమిటో చూద్దామా..
పోస్టాఫీసు టైం డిపాజిట్‌తో ఇలా
ఇన్వెస్టర్ల పెట్టుబడిపై ఖచ్చితమైన రిటర్న్స్ ఇచ్చే పథకాలంటే పోస్టాఫీసు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలే. వాటిల్లో పోస్టాఫీస్ టైం డిపాజిట్ (పీవోటీడీ) స్కీం అత్యంత పాపులర్. బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను పోలి ఉన్నందునే దీన్ని పోస్టాఫీసు టైం డిపాజిట్ స్కీం అని పిలుస్తారు. ఈ స్కీం ఇన్వెస్టర్లకు సురక్షిత పొదుపు పథకం. ఈ పథకం కింద నిర్దిష్ట గడువుతో ఖాతా తెరువొచ్చు. ఖాతాదారుడి చాయిస్‌ను బట్టి 12 నెలలు, రెండేండ్లు, మూడేండ్లు, ఐదేండ్ల గడువుతో ఈ టైం డిపాజిట్ స్కీంలో ఖాతా తెరవచ్చు. క్యాష్ చెల్లించి గానీ, చెక్‌తో గానీ ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన ఆరు నెలల తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ వడ్డీ ఆదాయంపై పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
అత్యధికం ఫిక్స్డ్ డిపాజిట్లలోనే మదుపు
భారతీయుల్లో అత్యధికులు బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్థిరమైన ఆదాయం, సేఫ్టీ ఎక్కువ గల స్కీమ్‌లు బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు. ఇవి 10 ఏండ్ల గడువు కలిగి ఉంటాయి. అయితే, ఏడు రోజుల నుంచి ఏడాది గడువులోనూ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయొచ్చు. పలు బ్యాంకులు ఏడాది గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఎక్కువ టెన్యూర్ గల స్కీమ్‌లో డిపాజిట్ చేసినా.. మధ్యలో విత్‌డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. కాకపోతే వడ్డీపై జరిమానా వసూలు చేస్తాయి బ్యాంకులు. ఇక అన్ని బ్యాంకుల్లోనూ రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద బీమా సౌకర్యం లభిస్తుంది.
డెట్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువ
నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులతోపాటు ఈక్విటీ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వీటితోపాటు డెట్ ఫండ్స్ ఉంటాయి. స్వల్ప కాలిక గడువుతో కూడిన ఫండ్స్‌లో మదుపు చేయొచ్చు. వీటిలో రిస్క్ తక్కువే. స్వల్ప కాలికంగా మూడు నెలల నుంచి ఏడాది గడువు గల ఫండ్స్ ఎంచుకోవచ్చు. వాటిల్లో ఓవర్‌నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఆల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, లో డ్యూరేషన్, మనీ మార్కెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. డెట్ ఫండ్స్‌లో ఆరు శాతం వడ్డీ ఆదాయం పొందొచ్చు.
కార్పొరేట్ ఫండ్స్‌కు నో బీమా గ్యారంటీ
కొన్ని కార్పొరేట్ సంస్థలు ఏడాది నుంచి ఐదేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరిస్తున్నాయి. ప్రముఖ కార్పొరేట్ సంస్థలు స్వల్ప కాలిక డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నా.. వీటికి బీమా కవరేజీ గ్యారంటీ ఉండదు. కనుక ఈ పథకాల్లో డిపాజిట్లు చేస్తున్నప్పుడు ఇక్రా, కేర్, క్రిసిల్ వంటి సంస్థల రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. కేర్ ఏఏ, క్రిసిల్ ఎఫ్ఏఏ, ఏఏఏ వంటి రేటింగ్ గల స్కీమ్‌ల్లో పెట్టుబడులు పెట్టడం మంచిదని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
ఎక్కువ రిస్క్ లేని ఆర్బిట్రేజ్ ఫండ్స్
ఎక్కువ రిస్క్‌లేని ఫండ్స్‌లో క్యాటగిరీలోకి ఆర్బిట్రేజ్ ఫండ్స్ వస్తాయి. ఈ ఫండ్స్‌లో పెట్టుబడులు.. ఈక్విటీల్లో 65 శాతం ఉంటాయి. ఇన్వెస్టర్లు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మార్కెట్ ఒడిదొడుకుల్లోనూ లాభాలు గడించేందుకు ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. రాబడి.. రిటర్న్స్ ఎంత ఉంటాయన్న సంగతి ఇతమిద్ధంగా చెప్పలేం గానీ, సేవింగ్స్ అకౌంట్స్‌లో డిపాజిట్లపై కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. అలాగే వడ్డీ ఆదాయంపై పన్నులు వర్తిస్తాయి కూడా.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సామాజిక సమస్యలను కళాత్మకంగా మలచిన కేఎల్’
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

