Best Family Cars | రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ ఫ్యామిలీ కార్లివే.. !
Best Family Cars | మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి బాలెనో, కియా సోనెట్, హ్యుండాయ్ వెన్యూ, హ్యుండాయ్ ఐ20, టాటా నెక్సాన్ వంటి కార్లు కుటుంబాలకు ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటాయని చెబుతున్నారు.
Best Family Cars | ఇప్పుడు ఒక పంక్షన్‌కు వెళ్లాలన్నా, ఏదైనా ఊరికి వెళ్లాలన్నా, లేదా వివాహ వేడుక కోసం కుటుంబంతో కలిసి వెళ్లాలన్నా, తక్కువ ధరకే సౌకర్యవంతమైన కారు ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆకాంక్షలకు అనుగుణంగా కార్ల తయారీలో పోటీ పడుతున్నాయి కార్ల తయారీ సంస్థలు. రూ.10 లక్షల్లోపు ధరకు అందుబాటులో ఉన్న కార్ల గురించి తెలుసుకుందామా..!
రూ.6.61 లక్షల నుంచి మారుతి సుజుకి బాలెనో షురూ..
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి స్పేషియస్గా ఉన్న హ్యాచ్ బ్యాక్ బాలెనో కుటుంబ సభ్యులంతా సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుంది. అంతే కాదు ఫ్యుయల్ ఎఫిషియెంట్ డ్రైవ్ కలిగి ఉంటుంది. మోడ్రన్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్లతో అందుబాటులో ఉంటుంది. టచ్ స్క్రీన్ ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆంపుల్ బూట్ స్పేస్, స్ట్రాంగ్ మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చు ఉండటంతో కుటుంబాల ప్రయాణానికి వీలుగా ఉంటుందీ కారు. ఈ కారు ధర రూ.6.61 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
రూ.7.46 లక్షల నుంచి హ్యుండాయ్ ఐ20 లభ్యం
దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా కారు ‘హ్యుండాయ్ ఐ20’.. లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ చార్జింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ప్రీమియం ఇంటీరియర్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫీచర్లతో వస్తోంది. మల్టీపుల్ ఇంజిన్ ఆప్షన్లతో సౌకర్యవంతంగా డ్రైవింగ్ కు వీలుగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ సౌకర్యవంతంగా ప్రయాణించడానికి స్పేసియస్‌గా వీలుగా ఉంటది. క్వాలిటీ, సేఫ్టీ ఫీచర్లతో ఐ20 కారు ఉంటుంది. ఈ కారు ధర రూ.7.46 లక్షల నుంచి మొదలవుతుంది.
టాటా మోటార్స్ నెక్సాన్ ధర రూ.7.99 లక్షలు
దేశీయ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉన్న టాటా నెక్సాన్ బిల్డ్ క్వాలిటీ, ఎక్స్ లెంట్ సేఫ్టీ ఫీచర్లతో కూడిన కంపాక్ట్ ఎస్యూవీ. స్టైలిష్ డిజైన్, కంఫర్టబుల్ రైడ్, ఫీచర్ రిచ్ ఇంటీరియర్ విత్ ఏ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆంపుల్ స్టోరేజీ స్పేస్ కలిగి ఉంటాయి. నెక్సాన్ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తాయి. ఈ కారు ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
మారుతి స్విఫ్ట్ ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం
మారుతి సుజుకి కార్లలో పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు స్విఫ్ట్. రిలయబిలిటీ, పెప్పీ ఇంజిన్, గుడ్ ఫ్యుయల్ ఎఫిషియెన్సీకి పెట్టింది పేరు స్విఫ్ట్. స్పోర్టీ డిజైన్, కంఫర్టబుల్ సీటింగ్, వెల్ ఎక్విప్డ్ క్యాబిన్ విత్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. సిటీ ట్రాఫిక్‌లోనూ దూసుకెళ్లడంతోపాటు బుల్లి కుటుంబం ప్రయాణించేందుకు వెసులుబాటు కలిగి ఉంటుందీ. దీని ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
హ్యుండాయ్ వెన్యూ రూ.7.77 లక్షల నుంచి షురూ..
హ్యుండాయ్ కంపాక్ట్ ఎస్యూవీ వెన్యూ స్టైల్, కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మేలు కలయికగా నిలుస్తుంది. టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తోపాటు విస్తృత శ్రేణి ఇంజిన్ ఆప్షన్లు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి మోడ్రన్ ఫీచర్లు, వైర్ లెస్ చార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్పేసియస్ క్యాబిన్, హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఫ్యామిలీ ట్రిప్పులకు, పట్టణాల్లో డ్రైవింగ్ కు వీలుగా ఉండే ఈ కారు ధర రూ.7.77 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
కంఫర్టబుల్ రైడింగ్ కు కియా సోనెట్ బెస్ట్
కియా ఇండియా ఫీచర్ రిచ్ కంపాక్ట్ ఎస్యూవీ కియా సోనెట్ కారు రైడింగ్ కు కంఫర్టబుల్ గా ఉంటుంది. లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, సన్ రూఫ్, టర్బో చార్జిడ్ పెట్రోల్ వేరియంట్‌తోపాటు మల్టీఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు, మోడ్రన్ డిజైన్ తో వస్తున్న కియా సోనెట్ కారు ధర రూ.7.79 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

