Best Electric cars | నిర్వహణ ఖర్చు తక్కువ, ఎఫిషియెన్సీ వంటి కారణాలతో భారతీయులు రోజురోజుకు ఎలక్ట్రిక్ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. టాటా మోటార్స్, మొర్రిస్ గ్యారెజెస్ (ఎంజీ మోటార్), హ్యుండాయ్, మహీంద్రా నూతన ఈవీ కార్లను మార్కెట్లో ఆవిష్కరించాయి. ఇంతకుముందు కూడా మార్కెట్లో కస్టమర్ల ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా బెస్ట్ చాయిస్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయినా దీర్ఘ శ్రేణి సామర్థ్యం, సైలెంట్ ఆపరేషన్, అద్భుతమైన ఎఫిషియెన్సీ ఉండటంతో ఈ సంస్థలు తెచ్చిన ఈవీ కార్లు ఇంప్రెస్సివ్‌గా ఉన్నాయి. రూ.5.28 లక్షల నుంచి గరిష్టంగా రూ.23.84 లక్షల మధ్య ధర పలుకుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఈవీ కార్ల నిర్వహణ గణనీయంగానే తక్కువ. ధర రూపంలోనూ కస్టమర్లకు ఆకర్షణీయంగా ఉన్నాయి. పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంక్ నింపడానికయ్యే ఖర్చుతో పోలిస్తే విద్యుత్ చార్జింగ్ చౌక. దీంతోపాటు పర్యావరణ హితం కూడా.. సంప్రదాయ కార్లతో పోలిస్తే ఈవీ కార్ల మెయింటెనెన్స్ కూడా తక్కువ ఖర్చు. ఈవీ కార్లకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు టాక్స్‌లు కూడా తక్కువే. ఈవీ కార్ల కొనుగోలుదారులకు ప్రభుత్వాలు పలు పథకాల రూపంలో కస్టమర్లకు డిస్కౌంట్లు, బెనిఫిట్లు కల్పిస్తున్నాయి.. ఆయా ఈవీ కార్లు.. వాటిపై వచ్చే బెనిఫిట్లు.. వాటిలో ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..
సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కారు ఇది. 3-ఫేజ్ పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ కలిగి ఉంటుంది. లిథియం అయాన్ పాలిమార్ బ్యాటరీ ఉంటుంది. సుదూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు టెంపరేచర్ తగ్గించడానికి బ్యాటరీలో లిక్విడ్ కూలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ కారు గరిష్టంగా 127 బీహెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది. మూడు రంగుల్లో లభిస్తుంది.
ఈ కారు బ్యాటరీ కెపాసిటీ 30.2 కిలోవాట్లు. సింగిల్ చార్జింగ్‌తో 312 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఫాస్ట్ చార్జర్ సాయంతో గంటలో 80 శాతం చార్జింగ్ అవుతుంది. ఈ కారు ధర రూ.14.99 లక్షలు. 5-స్టార్ ఎన్సీఏపీ రేటింగ్ కలిగి ఉంటుంది.
బ్రిటిష్ బ్రాండ్ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తీసుకొచ్చిన ప్రీమియం ఈవీ కారు ‘ఎంజీ జీఎస్’. 448 లీటర్ల బూట్ స్పేస్, డైమండ్ కట్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, పవర్ అసిస్టెడ్ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఆప్షన్ ఉంటుంది. 44.5 కిలోవాట్ల సామర్థ్యం గల బ్యాటరీ 353 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సింగిల్ చార్జింగ్ చేస్తే 340 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఫాస్ట్ చార్జర్ సాయంతో 50 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. స్టాండర్డ్ చార్జింగ్ కు దాదాపు 6-8 గంటలు పడుతుంది. ఈ కారు ధర రూ.22.58 లక్షలు.
టాటా మోటార్స్ తీసుకొచ్చిన టైగోర్ ఈవీ కారు 3-ఫేస్ ఏసీ ఇండక్షన్ మోటార్ కలిగి ఉంటది. రెండు రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 310 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. గరిష్టంగా 40 హెచ్‌పీ, 105 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
21.5 కిలోవాట్ల సామర్థ్యం గల బ్యాటరీ.. ఫుల్ చార్జింగ్‌తో 142 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఫాస్ట్ చార్జింగ్‌తో 90 నిమిషాల్లో, రెగ్యులర్‌గా దాదాపు ఆరు గంటల్లో పూర్తిగా చార్జింగ్ అవుతుంది. ఈ కారు ధర రూ.12.49 లక్షలు. పర్మినెంట్ మాగ్నైట్ సింక్రోనస్ సిస్టమ్ కలిగి ఉంటుంది.
హ్యుండాయ్ కోనా ఈవీ కారు అడ్వాన్స్డ్ పర్మినెంట్ మాగ్నైట్ సింక్రోనస్ మోటార్ (పీఎంఎస్ఎం) సిస్టమ్ కలిగి ఉంటుంది. కేవలం పది సెకన్లలో 100 కిమీ స్పీడ్ అందుకుంటుంది. 39.2 కిలోవాట్ల సామర్థ్యం గల బ్యాటరీ పూర్తిగా చార్జి అయితే 452 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. 395 ఎన్ఎం టార్చి, 134 హెచ్‌పీ విద్యుత్ అందిస్తుంది. ఫాస్ట్ చార్జర్‌తో 57 నిమిషాలు, రెగ్యులర్ చార్జర్‌తో ఆరు గంటల్లో పూర్తిగా చార్జింగ్ అవుతుంది. ఈ కారు ధర రూ.23.84 లక్షలు.
మహీంద్రా అండ్ మహీంద్రా తీసుకొచ్చిన ఈవీ కారు ఈ-20 ప్లస్ కంపాక్ట్ మోడల్. ఇది పలు రంగుల్లో లభిస్తుంది.84 కిలోల బరువు గల లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ కారులో 3-ఫేస్ ఏసీ ఇండక్షన్ మోటార్ ఉంటది. ఈ బ్యాటరీ సామర్థ్యం 10.08 కిలోవాట్లు. ఈ కారు గరిష్టంగా 25 బీహెచ్పీ విద్యుత్, 70 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఒక్కసారి చార్జింగ్ పూర్తయితే 99.9 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఫాస్ట్ చార్జర్ సాయంతో 75 నిమిషాలు, స్టాండర్డ్ చార్జర్ సాయంతో పూర్తిగా చార్జింగ్ కావడానికి ఆరు గంటల టైం పడుతుంది. ఈ కారు ధర రూ.7.48 లక్షలు.
టాటా మోటార్స్ తీసుకొచ్చిన టియాగో ఈవీ కారు హై-ఓల్టేజ్ జిప్ట్రాన్ టెక్నాలజీతో డిజైన్ చేశారు. రెండు బ్యాటరీ ప్యాక్ చాయిస్‌ల్లో లభిస్తుంది. 19.2 కిలోవాట్ల కెపాసిటీ గల బ్యాటరీ 61 హెచ్‌పీ విద్యుత్ 110 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 24 కిలోవాట్ల బ్యాటరీ 74 హెచ్‌పీ విద్యుత్, 114 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఏసీ-ఇండక్షన్ త్రీ-ఫేస్ మోటార్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు ధర రూ.8.69 లక్షలు. సింగిల్ చార్జింగ్ తో 315 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.
మహీంద్రా అండ్ మహీంద్రా తీసుకొచ్చిన సెడాన్ ఈవీ మహీంద్రా ఈ-వెరిటో ఏసీ-ఇండక్షన్ త్రీ-ఫేస్ మోటార్ కలిగి ఉంటుంది. 510 లీటర్ల బూట్ స్పేస్, ఎలక్ట్రో-హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, ట్యూబ్ లెస్ స్టీల్ వీల్స్ తదితర పీచర్లు ఉంటాయి. శన్ కలర్ డైమండ్ వైట్ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ కారు బ్యాటరీ 21.2 కిలోవాట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ అయితే 140 కి.మీ దూరం ప్రయాణం చేయొచ్చు. ఫాస్ట్ చార్జింగ్కు 1.45 గంటలు పడుతుంది. ఈ కారు ధర రూ.5.28 లక్షలు.