Budget Smart Phones | ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్లమయం.. అందునా దేశమంతా 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణం.. మీ బడ్జెట్ ధరలో 5జీ కనెక్టివిటీ గల స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా.. మెరుగైన ఫీచర్లతో రూ.15 వేల లోపు ధరకే ఫోన్ వస్తే కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతారు. పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇప్పటికీ 5జీ నెట్వర్క్ కనెక్టివిటీ గల స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నాయి.. మరికొన్ని సంస్థలు 5జీ ఫోన్లు అందుబాటులోకి తెస్తున్నాయి. టెలికం సంస్థలు అందిస్తున్న హైస్పీడ్ ఇంటర్నెట్ను అందిపుచ్చుకునేందుకు బెస్ట్ ఫీచర్లు, అందుబాటు ధరలో 5జీ ఫోన్ ఉంటే కొనుక్కోకుండా ఉండగలరా.. అలా ప్రస్తుతం ఎనిమిది బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..
గతేడాది సెప్టెంబర్ 14న ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఐక్యూ’.. మార్కెట్లోకి ‘ఐక్యూ జడ్6 లైట్ 5జీ’ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ 18వాట్ల చార్జింగ్, 4జీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వరల్డ్ ఫస్ట్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ బ్యాటరీ 127 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ టైం, ఓటీటీ స్ట్రీమింగ్ 14.5 గంటల పాటు సపోర్టింగ్‌గా ఉంటుంది. అయితే, ఈ ఫోన్ వాస్తవ ధర రూ.15,999. ఈ ఫోన్‌పై ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ 13 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. అంటే రూ.13,999లకే సొంతం చేసుకోవచ్చు.
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి గెలాక్సీ ఎం13 5జీ ఫోన్ తెచ్చింది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. 6.5-అంగుళాల హెచ్డీ + ఇన్ఫినిటీ – వీ ఎల్సీడీ స్క్రీన్ విత్ 90 హెర్ట్ రీఫ్రెష్ రేట్, ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ విత్ మాలి-జీ57 ఎంసీ2 జీపీయూతో అందుబాటులో ఉంది. 4జీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.11,99, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.13,999లకు లభిస్తుంది.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ అనుబంధ రెడ్మీ.. భారత్ మార్కెట్లోకి రెడ్మీ11 ప్రైమ్ 5జీ ఫోన్ గతేడాది సెప్టెంబర్ ఆరో తేదీన ఆవిష్కరించింది. ఈ ఫోన్ సైతం 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18వాట్ల పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కొనుగోలుదారులు 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. 90 హెర్ట్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్తో వస్తున్నది. దీని వాస్తవ ధర రూ.15,999. కాగా, అమెజాన్‌లో 13 శాతం డిస్కౌంట్‌తో రూ.13,999లకు లభిస్తుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.1049 వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ సౌకర్యం కూడా ఉంది.
గతేడాది మే 18న మార్కెట్లోకి వచ్చిన రియల్మీ నార్జో50 5జీ ఫోన్ 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. 4జీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.13,499, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.14,499లకు లభిస్తుంది. హైపర్ బ్లూ, స్పీడ్ బ్లూ రంగుల్లో లభ్యం అవుతుంది.
పొకో ఎం4 ప్రో 5జీ ఫోన్ గతేడాది ఏప్రిల్ 29న మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 4జీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్పామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేస్తే 27 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. వాస్తవంగా ఈ ఫోన్ ధర రూ.21,999. డిస్కౌంట్ పోగా రూ.15,999లకే సొంతం చేసుకోవచ్చు. 16.76 సీఎం ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తున్నది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.
రియల్మీ 9ఐ 5జీ ఫోన్ గతేడాది ఆగస్టు 18న మార్కెట్లోకి ఎంటరైంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. ఈ ఫోన్ 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభ్యం అవుతుంది. ఈ ఫోన్ ధర రూ.14,999 నుంచి రూ.17,999 మధ్య పలుకుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం క్యాష్ బ్యాక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై రూ.1000, ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై రూ.1000 ధర తగ్గుతుంది.
లావా బ్లేజ్ 5జీ ఫోన్ గతేడాది నవంబర్ 15న మార్కెట్లో ఆవిష్కరించారు. 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది. 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.16,345. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో కొనుగోలు చేసిన వారికి 27 శాతం డిస్కౌంట్ మీద రూ.11,999లకే లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.