న్యూఢిల్లీ, జనవరి 20: అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ..దేశీయ మార్కెట్‌కు మరో కొత్త మాడల్ పరిచయం చేసింది. రూ.6 కోట్ల ధర కలిగిన నూతన బెంగయగాను విడుదల చేసింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ నూతన మాడల్‌తో ప్రస్తుత సంవత్సరంలో అమ్మకాలు మరో 40 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 2022లో 40 యూనిట్లు అమ్ముడవగా..2023లో 60 యూనిట్లు అమ్ముడవగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇంజిన్: 4 లీటర్ల 550 పీఎస్ వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారులో 8 ఆటోమేటిక్ గేర్లు ఉన్నాయి.
వేగం: కేవలం 4.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 290 కిలోమీటర్లు దూసుకుపోనున్నది.
డీలర్లు: హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబైలలో మాత్రమే షోరూంలు ఉన్నాయి.
డెలివరీ: బుకింగ్ చేసుకున్నవారికి 7-8 నెలల పట్టొచ్చు