పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) కొనాలని చూస్తున్నవారికి శుభవార్త. కొన్ని బ్యాంక్‌లు ఈవీల కొనుగోలుకు ప్రత్యేక వడ్డీ రేట్లతో రుణాలిస్తున్నాయి. ఇవి సాధారణ ఆటోమొబైల్ రుణాలకంటే 20 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకూ (0.2 శాతం నుంచి 0.5 శాతం) తక్కువ వడ్డీపై ఈవీలకు రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ రుణాలు 4 వీలర్లకే కాకుండా టూ వీలర్లకు కూడా లభిస్తున్నాయి. 10-15 శాతం మార్జిన్ మనీ చెల్లిస్తే చాలు..ఈవీలకు ఆ బ్యాంక్‌లు రుణాలిస్తామంటున్నాయ. కొన్ని ఈవీ మోడల్స్‌పై ఎస్బీఐ 100 శాతం ఫైనాన్స్‌ను సైతం అందిస్తున్నది.
ఈవీలకు తగ్గింపు రేట్లతో రుణాలిస్తున్న బ్యాంక్లివే..