Personal Loans | తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ కావాలా.. ఏం చేయాలంటే..!
Personal Loans | పర్సనల్ లోన్ అన్సెక్యూర్డ్ లోన్. అయితే మీ అవసరాలతోపాటు సిబిల్ స్కోర్‌ను బట్టి పర్సనల్ లోన్ మంజూరవుతుంది.
Personal Loans | పర్సనల్ లోన్ అన్సెక్యూర్డ్ లోన్. మీరు ఒకవేళ పర్సనల్ లోన్ తీసుకుంటున్నట్లయితే, దానికోసం ఎటువంటి ష్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్సనల్ లోన్‌ను ఎలా వాడుకోవాలన్న అంశంపై ఎటువంటి పరిమితుల్లేవు. పర్సనల్ లోన్ ద్వారా పొందే సొమ్మును రుణ గ్రహీత పలు అవసరాలకు వాడుకోవచ్చు. కచ్చితమైన వడ్డీరేటుపై నిర్దిష్ట రీపేమెంట్స్ టెన్యూర్‌లో తిరిగి చెల్లించే లోన్ పర్సనల్ లోన్. రుణ గ్రహీత అవసరాలు, నిధుల అర్హత, రుణాల చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి కొల్లెటరల్ సెక్యూరిటీ లేకుండానే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఆచరణలో రుణ గ్రహీతలు తప్పనిసరిగా ఉద్యోగులై ఉండాలి. వారి వ్యక్తిగత, ఉద్యోగ సమాచారానికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కీలక వడ్డీరేట్లు పెరిగినా.. ఇప్పటికీ తక్కువ వడ్డీరేటుపై పర్సనల్ లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఉన్నాయి.. అవేమిటో చూద్దామా.. !
బ్యాంక్ ————————- పర్సనల్ లోన్ మొత్తం ————– గడువు ————— వడ్డీరేటు
ఐడీబీఐ బ్యాంక్ ————— రూ.25 వేల నుంచి రూ.5 లక్షలు — 12-60 నెలలు ——- 8.90-14%
సిటీ యూనియన్ బ్యాంక్ —- రూ.5000 నుంచి రూ.5 లక్షలు —– 12 నెలలు ———– 9.50%
ఇండియన్ బ్యాంక్ ———– రూ.50వేల నుంచి రూ. 5 లక్షలు — 12 – 36 నెలలు ——- 9.40% – 9.90%
కరూర్ వైశ్యా బ్యాంకు ——— రూ. 10 లక్షల వరకు —————- 12 – 60 నెలలు ——- 9.40% – 19.00%
పంజాబ్ నేషనల్ బ్యాంక్ —- రూ. 10 లక్షల వరకు —————– 60 నెలల వరకు —– 9.35% – 15.35%
సిబిల్ స్కోర్‌తోనే పర్సనల్ లోన్
మీ క్రెడిట్ (సిబిల్) స్కోర్‌ను బట్టే మీకు పర్సనల్ లోన్ వస్తుంది. సిబిల్ స్కోర్ 300-900 పాయింట్ల మధ్యలో ఉంటుంది. స్కోర్ ఎక్కువగా ఉంటే మీ లోన్ అప్లికేషన్ తేలిగ్గా అప్రూవ్ అవుతుంది. అధిక క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి గానీ, ఎక్కువ రుణం గానీ లభ్యం అవుతాయి. సిబిల్ స్కోర్ 750 పాయింట్ల కంటే తక్కువగా ఉంటే పర్సనల్ లోన్ పొందే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ లోన్ వచ్చినా తక్కువ మొత్తం అదీ కూడా ఎక్కువ వడ్డీరేటు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉంటే.. అందుకు కారణాలు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఈఎంఐ చెల్లింపులు జాప్యం చేసినా, పలు బ్యాంకుల క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసినా, రుణాల కోసం దరఖాస్తు చేసినా సిబిల్ స్కోర్ తగ్గుముఖం పడుతుంది.
పర్సనల్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు ఇలా
మీరు రూ. లక్ష మేరకు పర్సనల్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు 2.5 శాతం చెల్లించాలి. అంటే రూ.2500 ప్రాసెసింగ్ ఫీజుతోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పర్సనల్ లోన్‌తోపాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు రుణంపై చేసే సర్వీస్ రిక్వెస్ట్‌లను బట్టి ఇతర చార్జీలు వర్తిస్తాయి. ముందస్తు రుణాన్ని చెల్లిస్తున్నట్లయితే బ్యాలెన్స్ అమౌంట్‌ను బట్టి వడ్డీరేటు ఖరారు చేస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

