Banks | త్వరలో బ్యాంకులకూ ఐదు రోజుల పని విధానం.. వేతన పెంపు కూడా..?!
Banks | బ్యాంకు ఉద్యోగుల వేతన పెంపుతోపాటు కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగా వారానికి ఐదు రోజుల పని విధానం త్వరలో అమలులోకి రానున్నట్లు తెలుస్తున్నది. బ్యాంకుల యాజమాన్యాలతో కూడిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సంప్రదింపులు జరుపుతున్నది.
Banks | ప్రభుత్వ, ప్రైవేట్, సహకార బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు త్వరలో తీపి కబురందే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగుల వేతన పెంపుతోపాటు కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగా వారానికి ఐదు రోజుల పని విధానం త్వరలో అమలులోకి రానున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల యాజమాన్యాల ఆధ్వర్యంలోని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చర్చలు జరుపుతున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది.
బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతనం పెంపునకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సుముఖంగా ఉన్నట్లు వినికిడి. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం అంత కంటే ఎక్కువ వేతనాల పెంపు డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కరోనా మహమ్మారి వేళ అవిశ్రాంతంగా సేవలందించి, ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడంలో బ్యాంకులు కీలకంగా వ్యవహరించాయి. దీనికి తోడు ఇటీవల బ్యాంకుల లాభాలు పెరిగినందున ఉద్యోగులకు వేతనాలు మెరుగ్గా పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బ్యాంకుల్లో ఐదు రోజుల పని విధానం గురించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతిపాదనలు సమర్పించింది. ఐబీఏ ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థికశాఖ, ఆర్బీఐ ఆమోదం తెలుపాల్సి ఉంది. ఎల్ఐసీలోనూ ఐదు రోజుల పని విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. ఇప్పటికే బ్యాంకులకు రెండో, నాలుగో శనివారం సెలవు అమల్లో ఉంది. ఐబీఏ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే, బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

