Bank Working Hours | బ్యాంకింగ్‌లో వారానికి ఐదు రోజులే పని వేళలు.. బట్ తిరస్కరించిన ఐబీఏ
Bank Working Hours | బ్యాంకుల్లో ఐదు రోజుల పని విధానం తేవాలన్న ఉద్యోగ సంఘాల ప్రతిపాదనను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేసన్ తిరస్కరించింది.
Bank Working Hours | బ్యాంకింగ్ రంగ ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమల్లోకి తేవాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రతిపాదించాయి. ఐదు రోజుల వారం విధానం అమలు కోసం ప్రతి రోజు అదనంగా ఒక గంట విధులు నిర్వర్తించాలని ప్రతిపాదించాయి. దీని ప్రకారం ప్రతి రోజు ఉదయం 30 నిమిషాలు ముందుగా సేవలు ప్రారంభించాలని పేర్కొన్నాయి. ఇప్పుడు అమల్లో ఉన్న కస్టమర్ సర్వీస్ అవర్స్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ టైం మరో అర్థగంట పెంచాలని సూచించాయి.
ఈ ప్రతిపాదన ప్రకారం పని గంటలు ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటలకు పెంచాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. క్యాష్ ట్రాన్సాక్షన్లను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి 3.30 గంటల వరకు, నాన్-క్యాష్ ట్రాన్సాక్షన్ టైం 3.30 గంటల నుంచి 4.45 గంటలకు పెంచాలని సూచించాయి.
‘బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఐబీఏ (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్) అందుకు అంగీకరించడం లేదు. గతేడాది భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. మళ్లీ ఈ ప్రతిపాదనను ఐబీఏ ముందు పెట్టాం. రెండు శనివారాలను సెలవు దినాలుగా ఎలా కాంపన్సేట్ చేయాలో మా వైఖరి, అభిప్రాయాలు తెలియజేయాలని ఐబీఏ కోరుతున్నది. ఐబీఐ ఆకాంక్షల మేరకు ప్రతి రోజూ 30 నిమిషాలు పని వేళలు పెంచడానికి మేం అంగీకరిస్తున్నాం. మా అభిప్రాయాలను, సూచనలను ఐబీఏ, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ అంగీకరిస్తాయని ఆశాభావంతో ఉన్నాం’ అని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి వేళ వైరస్ సోకకుండా ఉండేందుకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశ పెట్టాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ, బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతిపాదనను ఐబీఏ తిరస్కరించింది. అయితే, ఉద్యోగుల వేతనం 19 శాతం పెంచుతామని ఆఫర్ చేసింది ఐబీఏ. ప్రస్తుతం ప్రతి ఆదివారం, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు దినాలు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

