Bank of Baroda Home Loans | బ్యాంక్ ఆఫ్ బరోడా బంపరాఫర్.. ఈ రుణాలపై వడ్డీరేట్లలో రాయితీ.. ఇవీ డిటైల్స్..!
Bank of Baroda Home Loans | పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఏడాది చివరి వరకు ఆకర్షణీయ వడ్డీరేట్లపై ఇండ్ల రుణాలు, పర్సనల్ లోన్లు, కార్ల రుణాలు, విద్యా రుణాలు అందిస్తోంది.
Bank of Baroda Home Loans | గత నెలాఖరులో ఓనం పండుగతో దేశంలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభమైంది. భారతీయులు పండుగల సీజన్లోనే ఇండ్లలో అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. గతంలో బంగారం.. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుగోలు చేసేవారు.. ఇప్పుడు ఆకర్షణీయమైన.. తమకు ఇష్టమైన స్మార్ట్ ఫోన్ కొంటున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో కార్లు కూడా కొంటున్నారు. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా దాదాపు ప్రముఖ బ్రాండ్ సంస్థలు ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నాయి. ఆ బాటలోనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ప్రయాణిస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) సైతం అదే రూట్లో సాగుతోంది. `బీవోబీ కే సాంగ్ త్యోహార్ కీ ఉమాంగ్` అనే పేరుతో కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఫెస్టివ్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ ఆఫర్ ఈ ఏడాది చివరి వరకూ ఉంటుంది. ఇండ్ల రుణాలు మొదలు పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్ల వరకూ ఆకర్షణీయ వడ్డీరేట్లు ఆఫర్ చేస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై పండుగ సీజన్ కింద ఆకర్షణీయ డిస్కౌంట్లు అందుబాటులోకి తెస్తున్నది. అందుకోసం పేరొందిన బ్రాండ్ సంస్థలతోనూ `బీవోబీ` పార్టనర్షిప్ ఒప్పందాలు చేసుకున్నది. ఈ ఏడాది చివరి వరకూ 8.40 శాతం వడ్డీరేటుపై ఇండ్లు, 8.70 శాతంపై కార్ల రుణాలు తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేసింది.
ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాకోర్సు అభ్యసించాలని తపిస్తుంటారు. అటువంటి వారికి 8.55 శాతంతో ప్రారంభమయ్యే విద్యారుణాలపై వడ్డీరేట్లపై 60 బేసిక్ పాయింట్లు డిస్కౌంట్ ఇస్తోంది. ప్రతిష్ఠాత్మక దేశీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు ఎటువంటి కొల్లెటరల్ పత్రాల్లేకుండానే రుణాలు మంజూరు చేస్తున్నది. ఇక రూ.20 లక్షల వరకు పర్సనల్ లోన్లపైనా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసింది. 10.10 శాతం వడ్డీతో ప్రారంభమయ్యే వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్ 80 బేసిక్ పాయింట్లు తగ్గిస్తున్నది. వ్యక్తిగత, కార్ల రుణ గ్రహీతలు ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీరేట్ ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నది. ఆస్తుల తనఖా రుణాల ప్రాసెసింగ్ కోసం దేశంలోని పలు నగరాల్లో 112 రిటైల్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్ల బెనిఫిట్ కల్పించేందుకు నాలుగు సరికొత్త సేవింగ్స్ అకౌంట్లు ఓపెన్ చేసింది. బీవోబీ లైట్ సేవింగ్స్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ (16-25 ఏండ్ల లోపు విద్యార్థులు), కుటుంబ సభ్యుల కోసం మై ఫ్యామిలీ/మై బ్యాంక్/ బీవోబీ పరివార్ ఖాతాలతోపాటు ప్రవాస భారతీయులకు `బరోడా ఎన్నారై పవర్ ప్యాక్ ఖాతాలు ప్రారంభించింది. కొత్తగా బీవోబీ సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్ అనే పేరుతో రికరింగ్ డిపాజిట్ స్కీం కూడా ఓపెన్ చేసింది. పండుగల సీజన్లో ఈ పొదుపు ఖాతాదారులు పలు ప్రయోజనాలు, డిస్కౌంట్లు, రాయితీలు పొందొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
Smart Phone Tips | మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ సెట్టింగ్స్ మార్చి చూడండి
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

