April Bank Holidays | ఏప్రిల్‌లో బ్యాంకులు పని చేసేది 16 రోజులే.. ఇవీ రాష్ట్రాల వారీ సెలవులు..!
April Bank Holidays | సోమవారం నుంచి ఏప్రిల్ నెల ప్రారంభం అవుతున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలవుతున్నది. వివిధ పండుగలు, పర్వదినాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
April Bank Holidays | గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం లావాదేవీలన్నీ డిజిటలైజ్ అయినా, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. దాంతోపాటు ప్రతి ఒక్కరి సమయం ఇప్పుడు చాలా విలువైనది. ఈ పరిస్థితుల్లో బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో చెక్ చేసుకోవడం బేష్షుగ్గా ఉంటుంది. 2024లో ఇప్పటికే మూడు నెలలు కాలగర్భంలో కలిసిపోయాయి. సోమవారం నుంచి కొత్తనెల ఏప్రిల్ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) కూడా మొదలవుతుంది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం వివిధ రాష్ట్రాలతో కలిపి బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉంటాయి.
ఏప్రిల్ నెలలో బ్యాంకులకు జాతీయ సెలవులు లేకున్నా.. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందామా..!
ఏప్రిల్ 1: ఏప్రిల్ ఒకటో తేదీన వార్షిక బ్యాంకు ఖాతాల క్లోజింగ్ సందర్భంగా దేశమంతా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే, చండీగఢ్, సిక్కిం, మిజోరం, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు పని చేస్తాయి.
ఏప్రిల్ 5: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జుమాత్ ఉల్ విదా సందర్భంగా తెలంగాణ, జమ్ముల్లో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 9: ఉగాది, తెలుగు సంవత్సరాది, గుడిపడ్వ, సాజిబు నాంగపంబా (చీరావుబా) తొలి నవరాత్రి సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 10: బొహగ్ బిహు, బైశాఖీ, బిజూ ఫెస్టివల్ సందర్భంగా త్రిపుర, అసోం, జమ్ముకశ్మీర్‌ల్లో బ్యాంకులు పని చేయవు.
ఏప్రిల్ 15: బొహగ్ బిగు, హిమాచల్ దినోత్సవం సందర్భంగా అసోం, త్రిపుర, మణిపూర్, జమ్ముకశ్మీర్‌ల్లో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 16: శ్రీరామ నవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఏప్రిల్ 20: గరియా పూజ పండుగ సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు.
బ్యాంకుల సాధారణ సెలవులు ఇలా
ఏప్రిల్ 13న రెండో శనివారం, 27న నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 7, 14,21, 28 తేదీల్లో బ్యాంకులకు జాతీయ సెలవు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఖాతాదారులకు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

