Bank Holidays 2023 | కొత్త సంవత్సరంలో బ్యాంకులకు సెలవులు ఎన్నో తెలుసా?
Bank Holidays 2023 | 2023లో బ్యాంకులకు ఆర్బీఐ సెలవుల జాబితా ప్రకటించింది. జాతీయ సెలవు దినాలు మినహా ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా వివిధ పండుగలకు వేర్వేరు తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఇచ్చేసింది.
Bank Holidays 2023 | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. డిజిటల్ లావాదేవీల యుగంలోనూ వివిధ బ్యాంకుల ఖాతాదారులు ఆఫ్ లైన్ సేవలు పొందాలంటే తమ ఖాతా ఉన్న బ్యాంకు శాఖకు వెళ్లాల్సిందే. గతంలో ఏ లావాదేవీ నిర్వహించాలన్నా బ్యాంకుకు వెళితేనే పనులు పూర్తయ్యేవి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మొబైల్ ఫోన్లోనో, ల్యాప్ టాప్లోనో, డెస్క్ టాప్ కంప్యూటర్లోనో క్షణాల్లో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు కంప్లీట్ అవుతున్నాయి. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీతో లావాదేవీ పూర్తి చేసేయొచ్చు.
ఖాతా తెరవడం మొదలు నగదు ఇతరులకు ట్రాన్స్ ఫర్ చేయాలన్నా మొబైల్ ఫోన్లలోనే ప్రతి ఒక్కరూ పనులు పూర్తి చేస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలనుకున్నా, లాకర్లో వస్తువులు దాచుకోవాలన్నా కస్టమర్లు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిందే. ప్రస్తుత పరుగుల యుగంలో ఏ పని చేయాలన్నా ముందస్తు ప్లాన్ తప్పనిసరి అంటున్నారు.
దాదాపు బ్యాంకులన్నీ సెలవు దినాల్లోనూ ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్ ఆన్ లైన్లో నిర్వహించుకోవడానికి వెసులుబాటు కలిగిస్తున్నాయి. వీటికి తోడు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ (నెఫ్ట్), ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసీఎస్), రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), ఇమిడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) వంటి ఆన్ లైన్ సేవలు లభిస్తున్నాయి.
ప్రతి నెలలోనూ బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆయా సెలవులు చెక్ చేసుకోకుండా బ్యాంకుకు వెళితే, సెలవు అని తెలిస్తే నీరసపడాల్సి రావచ్చు. కనుక బ్యాంకుల సెలవులు, పని రోజుల గురించి ముందే తెలుసుకుని ప్లాన్ చేసుకుంటే తేలిగ్గా ఉంటుంది.
సుదీర్ఘంగా సెలవులు ఉంటే, ఆన్ లైన్లో పనులు చక్కబెట్టుకుంటున్నా.. ఏటీఎంల్లో నగదు కొరత ఏర్పడతుంది. బ్యాంకులకు సెలవులు ఉన్నా ఇప్పుడు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు అందుబాటులో ఉండటంతో పెద్ద తేడా ఉండట్లేదు.
మరో రెండు రోజుల్లో కొత్త వసంతం ప్రారంభం కాబోతున్నది. ఈ నేపథ్యంలో 2023లో పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) జాబితాను విడుదల చేసింది.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, అక్టోబర్ 2న గాంధీజీ జయంతి సందర్భంగా దేశమంతా బ్యాంకులకు సెలవులు. ఇక ప్రతి నెలా నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సెలవు దినాలు. ఒక నెలలో ఐదు శనివారాలు వస్తే.. ఐదో శనివారం బ్యాంకులు పని చేస్తాయి. వీటితోపాటు దేశవ్యాప్తంగా ప్రముఖలు జయంతి, వర్ధంతులకు సెలవులు ఉన్నాయి. ప్రాంతాల వారీగా, రాష్ట్రాల వారీగా ప్రముఖుల జయంతి లేదా వర్ధంతికి సెలవు.
మహా శివరాత్రి, హోలీ, ఉగాది, శ్రీరామ నవమి, రంజాన్, విజయదశమి, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలకు బ్యాంకులకు సెలవు. రాష్ట్రాల వారీ పండుగలకు ఆయా రాష్ట్రాల పరిధిలో సెలవులు ఇస్తారు. రాష్ట్రాల వారీగా పండుగల తేదీల్లోనూ తేడాలు, మార్పులు ఉంటాయి.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో 2023లో బ్యాంకుల సెలవులపై ఓ లుక్కేద్దాం..
- జనవరి 12 – స్వామి వివేకానంద జయంతి
- జనవరి 15 – సంక్రాంతి
- జనవరి 26- గణతంత్ర దినోత్సవం
- ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
- మార్చి 7 – హోలీ
- మార్చి 22 – ఉగాది/ తెలుగు సంవత్సరాది
- మార్చి 30 – శ్రీరామ నవమి
- ఏప్రిల్ 1 – ఆర్థిక సంవత్సర ప్రారంభం
- ఏప్రిల్ 5 – బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
- ఏప్రిల్ 7 – గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 14- డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి
- మే 1 – మే డే / కార్మిక దినోత్సవం
- జూన్ 25 – బోనాలు
- జూన్ 29 – బక్రీద్
- జూలై 29 – మొహర్రం
- ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం
- సెప్టెంబర్ 7 – శ్రీకృష్ణ జన్మాష్టమి
- సెప్టెంబర్ 19 – వినాయక చవితి
- సెప్టెంబర్ 28 – మిలాద్ ఉన్ నబీ
- అక్టోబర్ 2 – మహాత్మాగాంధీ జయంతి
- అక్టోబర్ 14 – మహాలయ అమవాస్య, బతుకమ్మ పండుగ ప్రారంభం
- అక్టోబర్ 22 – దుర్గాష్టమి
- అక్టోబర్ 24 – విజయదశమి
- నవంబర్ 12 – దీపావళి
- నవంబర్ 17 – గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి
- డిసెంబర్ 25 – క్రిస్మస్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

